చర్మ సౌందర్యానికి పుల్లని ఫ్రూట్ !

చర్మ సౌందర్యానికి పుల్లని ఫ్రూట్ !
x
Highlights

చర్మ సౌందర్యానికి పండ్ల పదార్దములు ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం 'కాస్మొటిక్ ప్యాక్స్' కన్నా...

చర్మ సౌందర్యానికి పండ్ల పదార్దములు ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం 'కాస్మొటిక్ ప్యాక్స్' కన్నా 'ఫ్రూట్ ప్యాక్స్' మంచిదంటున్నారు. పుల్లని జాతికి చెందిన పండ్లతో చర్మ సౌందర్యన్ని పెంపొందించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆరెంజ్ పండ్లతో కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు.

ఆరెంజ్ లో "కాల్షియం" మరియు "విటమిన్ సి" పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని ధ్రుడంగా చేయడంలో ఎంతో సహయపడతాయి. ఆరెంజ్ ని ఫ్రూట్ జూస్ రూపంలో.. గుజ్జు చేసుకుని.. పండు పై భాగము అనగ తొక్కని పొడిలా చేసి.. ఉపయోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

* ఆరెంజ్ ను 2 ముక్కలుగా కోసి ఒక ముక్కలోని రసాన్ని పిండి, అందులో 2 స్పూన్ల పెరుగు కలిపి ముఖమునకు పట్టించి 15-20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగితే, ముఖమంతా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతే కాకుండా జిడ్డుతనం పోయి.. కాంతివంతంగా కూడా అవుతుంది.

* ఆరెంజ్ పైన తోక్కులు ఎండబెట్టి పోడి చేసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల అరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే చాలా మృదువుగా కాంతివంతమైన, కోమలంగా మారుతుంది.

* రెండు స్పూన్ల ఆరెంజ్ రసంలో, 1 స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ రసం కలిపి ముఖమునకు రాస్తే మొటిమలని నివారించడమే కాకుండా, మచ్చలు ఉంటే పోతాయి. పరిశుబ్రమైన, తేజోవంతమైన చర్మం లభిస్తుంది.

* ఆరెంజ్ రసంలో ముల్తాని మట్టి,పాలు లేదా రోజ్ వాటర్ కలిపి ఒక అరగంట సేపు తరువాత ముఖానికి రాసి 20 నిమిషముల తరువాత గొరు వెచ్చని నేటితో శుబ్రపరుచుకోవాలి.ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మెరుస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories