ఉల్లికాడ ఎంత మంచిదో...

ఉల్లికాడ ఎంత మంచిదో...
x
Highlights

ప్రతి వంటలో తప్పనిసరిగా ఉపయోగించే వాటిలో ఉల్లి తప్పనిసరిగా ఉంటుంది. అవి రుచి కోసమే కాదు అరోగ్య పరంగాను చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉల్లియే కాదు వాటి కాడల...

ప్రతి వంటలో తప్పనిసరిగా ఉపయోగించే వాటిలో ఉల్లి తప్పనిసరిగా ఉంటుంది. అవి రుచి కోసమే కాదు అరోగ్య పరంగాను చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉల్లియే కాదు వాటి కాడల వల్ల చాలా కూడా హేల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉల్లికాడల్లోని ఎ, సి విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. వాటిలోని ఫైబర్, ఎ, బి,సి విటమిన్లు, ఫోలేట్‌తో పాటు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి లవణాలు అధికంగా ఉంటాయి.

ఉల్లి కాడాలు సలాడ్స్, సూప్‌లోనే కాకుండా కూరగా వండినా రుచిగానే ఉంటుంది. శరీరానికి సూక్ష్మపోషకాలను అందించడమే కాకుండాః జీవక్రియల్ని నియంత్రిస్తాయి. వాటిలో కావల్సినంత ఫైబర్ కూడా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారికి ఉల్లికాడలు మంచి ఔషదంగా పనిచేస్తుంది. ఉల్లిపొరకలోని సల్ఫర్ రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి, రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా చేస్తుంది.

వాటిలో అలైల్ సల్ఫైడ్ ఫ్రీరాడికల్స్ బయటకు పంపి కేన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ల విడుదలను నిలిపివేస్తుంది.ఉల్లికాడల్లోని కె,సి విటమిన్లు ఎముకలను ధృడంగా మారుస్తాయి. వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు జలుబు, దగ్గును నివారిస్తాయి.ఉల్లి పొరకలో కంటి ఆరోగ్యానికి మేలు చేసే కెరొటినాయిడ్స్, ఎ విటమిన్ కూడా ఉంటాయి. వాటిలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థ సజవుగా సాగెలా చెస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories