ముఖానికి ఐస్ క్యూబ్స్ రుద్దుకుంటే...

ముఖానికి ఐస్ క్యూబ్స్ రుద్దుకుంటే...
x
Highlights

బయట భగభగ మండుతున్న ఎండలు..వేడి తట్టుకోవడానికి చ‌ల్ల‌ద‌నం కోసం శరీరం త‌పిస్తూ ఉంటుంది. . ముఖ్యంగా ఎండ ప్రభావం ముఖంపై ఎక్కువగా ఉంటుంది. ఎండలో...

బయట భగభగ మండుతున్న ఎండలు..వేడి తట్టుకోవడానికి చ‌ల్ల‌ద‌నం కోసం శరీరం త‌పిస్తూ ఉంటుంది. . ముఖ్యంగా ఎండ ప్రభావం ముఖంపై ఎక్కువగా ఉంటుంది. ఎండలో అలిసిపోయిన ఫీలింగ్ ముందుగా ముఖంలోనే కనిపిస్తుంది. అయితే ఎండ ప్రభావం నుంచి మన ఫేస్‌ను కాపాడుకోవాలంటే ఐస్ క్యూబ్స్ సాయం చేస్తాయి. దాంతో ముఖ మ‌ర్ద‌న‌ చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది. వాటిని తీసుకుని ఐదు నిమిషాల పాటు ఫేస్‌పై రుద్ద‌డం వ‌ల‌న ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. చ‌ర్మ‌నిపుణులు కూడా ఐస్ వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

ఐస్ మ‌సాజ్‌తో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ని మెరుగుపరిచి ముఖం తాజాగా అందంగా మారేలా చేస్తుంది. ముఖంపై ఏదైనా నైట్ క్రీమ్ రాసుకున్న తర్వాత దానిపై ఐస్ క్యూబ్ తో రుద్ది చూడండి. అది ముఖానికి అద‌న‌పు అందాన్ని ఇస్తుంది. క్రీం ముఖ రంధ్రాల‌ లోప‌లికి చొచ్చుకుపోయి తేజస్సు కలిగెలా చేస్తుంది. క‌ళ్ల‌కింద ఏర్పడే నల్లటి వలయాలను త‌గ్గించ‌డంలో ఐస్ ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. రోజూ ఐస్‌తో మసాజ్ చేసుకోవడంతో కొన్ని రోజుల్లోనే మార్పు గ‌మ‌నించ‌వ‌చ్చు.

మొటిమ‌ల్ని అదుపులో ఉంచడంలో కూడా ఐస్ ఉపయోగపడుతుంది. ముఖ చ‌ర్మంలోని రంధ్రాల ద్వారా వచ్చే స్రవాలకు దుమ్ము కలవడంతో రంధ్రాలు పూడుకుపోయి మొటిమ‌లు ఏర్ప‌ాడుతుంటాయి. త‌ర‌చూ ఐస్‌తో మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల అన‌వ‌స‌ర జిడ్డు , మురికి వ‌దిలిపోతాయి. పాలిపోయిన ముఖానికి ఇది చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. క‌ళ్లు బాగా అల‌సిపోయిన‌పుడు ఉబ్బి ఇబ్బంది పెడుతుంది.

క‌ళ్ల‌కింద ఐస్ క్యూబ్‌ల‌తో రుద్ద‌డం వ‌ల్ల వాపు త‌గ్గి మునుపటిలా ఉంటాయి.. పాలిపోయి పొడిబారినట్లు ఉండే పెద‌వులకు త‌ర‌చూ మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల అవి తిరిగి తాజాగా మార‌తాయి. అలాగే త‌గినంత నీరు తీసుకోవ‌డం మంచిది. ఈకాలం అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకోవ‌డం పరిపాటుగా మారిపోయింది. ఐబ్రోస్ చేస్తున్న సమయంలో సహజంగా నొప్పి కలుగుతుంది. అయితే ఐస్‌తో రుద్ద‌డం వల్ల ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తక్కువ టైంలో ముఖం మెరిసేలా కనిపించాలంటే క్యూబ్‌ల‌తో ముఖంపై మ‌ర్ద‌న చేయాలి. ఇది స‌హ‌జ‌సిద్ధ మేక‌ప్‌లా ప‌నిచేస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories