చర్మ సౌందర్యాన్నికి వండర్ ఫుల్ డ్రింక్..

చర్మ సౌందర్యాన్నికి వండర్ ఫుల్ డ్రింక్..
x
Highlights

నిద్ర లేచిన వెంటనే చాల మంది మొదట చేసే పని కమ్మని కాఫీ తాగడం. నిద్రలేచిన వెంటనే కమ్మని కాఫీ తాగితే ఇక ఆరోజంతా ఉల్లాసంగా, ఉత్సహాంగా ఫీలయ్యే వారు ఎందరో.....

నిద్ర లేచిన వెంటనే చాల మంది మొదట చేసే పని కమ్మని కాఫీ తాగడం. నిద్రలేచిన వెంటనే కమ్మని కాఫీ తాగితే ఇక ఆరోజంతా ఉల్లాసంగా, ఉత్సహాంగా ఫీలయ్యే వారు ఎందరో.. దీని వెనుక ఎంత మహత్యం ఉందో తెలియదు కానీ, కాఫీ అడిక్ట్ అయ్యుండే వారు మాత్రం వందల్లో.. వేలల్లో..లక్షల్లో.. లెక్కపెట్టలేనంత మంది ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎక్కువగా రచయితలు, మ్యుజీషియన్స్, జర్నలిస్టులకు ఈ వ్యసనం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది స్టెరో టైప్ కానప్పటికీ ఈ వ్యసనం వెనుక మాత్రం ఏదో ఉందనే చెప్పవచ్చు.

కాఫీ గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. కాఫీ పౌడర్ కూడా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కాఫీలో చర్మసంరక్షణకు ఉపయోగపడే అద్భుతమైన ప్రయోజనాలెన్నో దాగున్నాయి. కాఫీలో ఉన్న ఉపయోగకరమైన లక్షణాలు చర్మానికి ఒక మ్యాజికల్ ఎఫెక్ట్స్ ను అందిస్తాయి. కాఫీలో అద్భుతమైన క్వాలిటీ కూడా దాగున్నాయి.

ఈ వండర్ ఫుల్ డ్రింక్ తాగడానికి మాత్రమే కాదు, అందాన్ని మెరుగుపరచడంలో కాఫీ గ్రేట్. మీరు కాఫీ లవర్ కాకపోయినా, మీ చర్మ సౌందర్యాన్నిపెంచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాఫీ ఫేషియల్ స్ర్కబ్ గా పనిచేస్తుంది కాఫీలో స్ర్కబ్బింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాఫీ పౌడర్ ఎక్కువ గరుకుగా ఉండదు కాబట్టి, చర్మానికి ఎలాంటి హాని కలిగించదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories