గ్రీన్ ఫుడ్స్ తో బెల్లీ ఫ్యాట్ దూరం

గ్రీన్ ఫుడ్స్ తో బెల్లీ ఫ్యాట్ దూరం
x
Highlights

బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మంది ఒక వ్యాధిగా భావిస్తుంటారు. నడుము చుట్టూ ఉండే ఎక్స్ ట్రా ఫ్యాట్ అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా బరువు...

బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మంది ఒక వ్యాధిగా భావిస్తుంటారు. నడుము చుట్టూ ఉండే ఎక్స్ ట్రా ఫ్యాట్ అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా బరువు తగ్గించుకొనే వారికి గ్రీన్ ఫుడ్స్ ఎంతగానో ఫలితాన్ని చూపిస్తాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో గ్రీన్ ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల 90 శాతం మెటబాలిజం రేటు పెరుగుతుందని, 93శాతం వ్యాధినిరోధకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు ఈ గ్రీన్ ఫుడ్స్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే చాన్సెస్ ఉండవు. మరి ఆ గ్రీన్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యాప్సికమ్ : క్యాప్సికమ్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. విటిమన్ సి అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్యాట్ బర్న్ అవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది.

గ్రీన్ ఆపిల్: సహజంగా ఎర్రగా ఉండే ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మనం అనుకుంటాం కాదా? అయితే రెడ్ ఆపిల్ కంటే గ్రీన్ ఆపిల్లో చాలా తక్కవ క్యాలరీలుండటం వల్ల ఆరోగ్యానికి మరింత బెటర్ గా సహాయపడుతుంది.

గ్రీన్ చిల్లీస్: ఎక్కువ శాతం వంటకాల్లో గ్రీన్ చిల్లీస్ వినియోగించడం వల్ల శరీరానికి మంచిది . స్పైసీస్ ఎక్కువగా తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు . స్పైసీ ఫుడ్స్ బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది. అదే విధంగా లోయర్ బెల్లీని తగ్గించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ బీన్స్: గ్రీన్ బీన్స్ లో ఫైబర్ మరియు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బాగా ఉడికించిన బీన్స్ ను తినడం వల్ల బరువు తగ్గుతారు.

బ్రొకోలీ: బ్రొకోలీ తినడానికి అందరూ ఇష్టపడరు. కానీ విటమిన్ కె ఇందులో లభిస్తుంది..త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రొకోలీ శరీరానికి చాలా మేలు చేస్తుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది. క్యాన్సర్ దూరం చేస్తుంది.

ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమిన్లు మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో అతి తక్కువ క్యాలరీలుంటాయి . ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ ఫుడ్.

గ్రీన్ క్యాబేజ్: బాయిల్ చేసి క్యాబేజ్ సూప్ ను రెండు వారాలకొకసారి తీసుకోవడం మంచిది . త్వరగా బరువు తగ్గించుకోవాలంటే జీర్ణశక్తికి ఇది చాలా మేలు చేస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories