పొట్టచుట్టూ కొవ్వుతో జరభద్రం

పొట్టచుట్టూ కొవ్వుతో జరభద్రం
x
Highlights

ఊబకాయం నేడు అందరిని వేధిస్తున్న పెద్ద సమస్య. మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోతోంది....

ఊబకాయం నేడు అందరిని వేధిస్తున్న పెద్ద సమస్య. మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోతోంది. అందరినీ అనారోగ్యం పాలు చేస్తోంది.. ముఖ్యంగా పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు వల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయని ఈ మధ్యే అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం శాత్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా పెద్దవారిలో వయసు పెరుగుతున్న కొద్ది కొవ్వు కరిగేందుకు ఉపకరించే వ్యాధినిరోధక కణాలు తగ్గుముఖం పడుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. వృద్ధులు ఎక్కువగా మధుమేహంతో బాధ పడటానికి పొట్టలో పేరుకుపోయిన కొవ్వే కారణమని వైద్యులు చెబతున్నారు. పొట్టలో కొలెస్ట్రాల వల్ల జీవక్రియల రేటు తగ్గి, వ్యాధినిరోధక శక్తి తగ్గుతోందని నిర్ధారించారు. అంతే కాదు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌ కూడా చేసిన పరిశోధనల్లో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువైతే అధిక రక్తపోటుకు దారి తీస్తుందని వెల్లడైంది.

నిద్రలేమి... జన్యుపరమైన కారణాల వల్ల పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. హార్ట్‌ అటాక్, టైప్‌ 2 మధుమేహంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు బెల్లీ ఫ్యాట్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వయస్సును బట్టి మన శరీరంలో మార్పులు వస్తుంటాయి. కొంత మంది బరువును కోల్పోతుంటే మరికొంత మంది లావవుతుంటారు. ఇందులో ముఖ్యంగా పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వ ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యులు. శరీరాన్ని రెస్ట్ మోడ్‌లో ఉంచకుండా వ్యాయామం నిత్యం చేస్తూ ఉండాలి. ఎక్కడైతే కొవ్వు పేర్కును ఉందో ఆ ప్రాంతాలను ప్రభావితం చేసే విధంగా కొంచెం ఎక్కువగా శ్రమ పడుతూ ఎక్సర్‌సైజ్ లు చేయాలి.

ఆహార విషయంలోనూ అజాగ్రత్త వద్దు. స్వీట్స్, డ్రింక్స్, ఫాస్ట్‌ ఫుడ్, స్పైసీ ఫుడ్ ను ఎంత వీలైంతే అంతగా దూరం ఉంచాలి. పండ్లు, కూరగాయలు, స్పైసీ లేని ఆహారం తినడం వల్ల కొవ్వు బాగా కరుగుతుంది. ప్రధానంగా మాంసం, పాలు తీసుకోవడం వల్ల పొత్తికడుపు కొవ్వు బాగా పెరుగుతుంది. అందుకే వీటికి దూరంగా ఉండటమే ఉత్తమం. వీలైనంత వరకు చేపలను తీసుకుంటే మంచిది. బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణంగా కాదు. తీవ్రమైన ఒత్తిడికి గురికావడం వల్ల బరువు తరగదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా..పొట్ట తగ్గడం కష్టమవుతుంది. అందుకే వీలైనంత వరకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి. మెడిటేషన్, యోగా వంటివి ఆచరించడం ఉత్తమమైన విధానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories