సంసారం సాఫీగా సాగాలంటే..

సంసారం సాఫీగా సాగాలంటే..
x
Highlights

సంసారం సగరంలా ఉండాలంటారు పెద్దలు. కానీ నేడు చాలా చిన్నచిన్న మనస్పర్థాలకే విడిపోతున్నారు. వృత్తికి ఇచ్చిన ప్రాధన్యత కుటుంబానికి ఇవ్వడం లేదు చాలా మంది. ...

సంసారం సగరంలా ఉండాలంటారు పెద్దలు. కానీ నేడు చాలా చిన్నచిన్న మనస్పర్థాలకే విడిపోతున్నారు. వృత్తికి ఇచ్చిన ప్రాధన్యత కుటుంబానికి ఇవ్వడం లేదు చాలా మంది. కెరీర్‌లో ముందుకు సాగాలంటే కష్టపడి పని చేయాల్సిందే! దానిని ఎవరూ కాదనరు. అయితే కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించాలి. లేకపోతే మన పడే కష్టానికి అర్థమే ఉండదు. ఇంట్లో ఉన్నప్పుడైన టీవీ, ఫోన్ లాంటి వ్యాపకాలను పక్కనపెట్టి భాగస్వామితో కాస్త మాట్లాడే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడి గురించి కూడా భాగస్వామికి మీద చూపించకూడదు... మీరు తనని కావాలనే దూరం ఉంచుతున్నారన్న భావన వారిలో బలపడకూడదు

ఎదుటివారిపై చూపించాల్సిన ఆవేశం ఇంట్లో వాళ్ళ చూపించకూడదు. ఇది చాలామంది చేసే పొరపాటే. తోటి ఉద్యోగులతోనో, స్నేహితులతోనో జరిగిన గొడవ పర్యవసాన్ని ఇంట్లో వారిపై ప్రదర్శించకూడదు. ట్రాఫిక్‌లో ఆలస్యమైనా ఆ ఆవేశం ఇంట్లోనే ప్రదర్శిస్తారు.అలాకాకుండా ఇంట్లోకి రాగనే ఆ కోపాలను మర్చిపోండి. మీ భాగస్వామితో ఆనందంగా మాట్లాడుతూ కష్టసుఖాలను పంచుకోండి.

మన జీవితంలో చాలా మంది చేడ్డవాళ్ళు మంచివాళ్ళు తారసపడుతూ ఉంటారు. ఎవరికెంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అనుమానాస్పదమైన బంధాలు పెంచుకోవద్దు. ఆ బంధం మీ సంసారంలోకి ప్రవేశిస్తోందన్న అనుమానం ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే! మీ స్నేహాన్ని భాగస్వామి అపార్థం చేసుకుండ చూడాలి. మీ బంధం హద్దులు మీరకుండా చూసుకోవాలి. ఆ స్నేహం మీ సంసారంలో వస్తే మీ బంధం చీలిపోయేందుకు దారితీస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories