వేడిగా ఉంది అని చల్లని బీరు తెగ తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం..

వేడిగా ఉంది అని చల్లని బీరు తెగ తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం..
x
Highlights

ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి..కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు భయపుతున్నారు..ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లని పానియాలు తాగడం ఏసీల కింద...

ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి..కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు భయపుతున్నారు..ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లని పానియాలు తాగడం ఏసీల కింద గంటల కొద్దీ గడపడం చేస్తున్నారు. ఇక మద్యం ప్రియుల విషయానికి వస్తే...కడుపులో చల్లగా ఉంటుంది కదా అని ఎత్తిన బీరు సీసా దించకుండా తాగేస్తారు. హాయిగా వుంది అని సంబరపడుతుంటారు. అయితే వాస్తవానికి వస్తే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు అని నిపుణులు అంటున్నారు. బీర్ తాగితే ఆరోగ్యంగా ఉంటామనడంలో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు.

ఆల్కహాల్ కలిసిన చల్లని బీరును తాగడం వల్ల శరీరంలో వేడి చేస్తుందని.. ఇబ్బందులకు గురవుతారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే బీరు తాగడం సరైన పద్ధతి కాదని..వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలి చెబుతున్నారు. నీటితో పాటు కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, పెరుగు పదార్దాలు తాగడం మంచిది అని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories