Stress Relief Foods : ఒత్తిడికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్..ఈ ఆహారాలు తింటే మీ మనసు హాయిగా సాగిపోవాల్సిందే

Stress Relief Foods : ఒత్తిడికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్..ఈ ఆహారాలు తింటే మీ మనసు హాయిగా సాగిపోవాల్సిందే
x

Stress Relief Foods : ఒత్తిడికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్..ఈ ఆహారాలు తింటే మీ మనసు హాయిగా సాగిపోవాల్సిందే

Highlights

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఆఫీసు పనులు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత సమస్యలు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతి ఒక్కరూ మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

Stress Relief Foods : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఆఫీసు పనులు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత సమస్యలు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతి ఒక్కరూ మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఒత్తిడి కేవలం మనశ్శాంతిని దూరం చేయడమే కాకుండా.. గుండె జబ్బులు, నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి అనేక శారీరక సమస్యలకు దారితీస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడి నుంచి సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన మూడ్‌ని మార్చి, మనసును ప్రశాంతంగా ఉంచే ఆ అద్భుతమైన ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

మానసిక ప్రశాంతతకు డార్క్ చాక్లెట్ ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. దీనిని మితంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మొన్లు విడుదలవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి, తక్షణమే ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే, ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అరటిపండులో ఉండే విಟమిన్ బి6, పొటాషియం, ట్రిప్టోఫాన్ అనే మూలకాలు మెదడును శాంతపరిచి, నిరాశ నిస్పృహలను దూరం చేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పట్టడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది.

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాదం, వాల్‌నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు నాడీ వ్యవస్థను బలోపేతం చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు. అలాగే, బెర్రీ పండ్లు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటివి) యాంటీ ఆక్సిడెంట్లకు నిలయాలు. ఇవి శరీరంలోని ఒత్తిడి కారకాలతో పోరాడి మనసును సంతోషంగా ఉంచే హార్మోన్లను విడుదల చేస్తాయి.

చిలగడదుంప లేదా గెనుసుగడ్డ కూడా ఒత్తిడి నివారణకు మంచి ఆహారం. ఇందులో విటమిన్ సి , పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రించి మనసును తేలికపరుస్తుంది. ఇక పానీయాల విషయానికి వస్తే, గ్రీన్ టీ అద్భుతమైన ఎంపిక. గ్రీన్ టీలో ఉండే ఎల్-థియానిన్ అనే పదార్థం మెదడుపై సానుకూల ప్రభావం చూపి ఒత్తిడి ప్రభావాలను తగ్గిస్తుంది. కాఫీ కంటే ఇందులో కెఫిన్ తక్కువగా ఉండటం వల్ల ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి గాఢ నిద్రకు సహాయపడుతుంది. ఈ ఆహారాలను మీ జీవనశైలిలో భాగం చేసుకుంటే ఒత్తిడి లేని హాయిని పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories