ఇంటర్నెట్ పై నియంత్రణ లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవలసిందే..

ఇంటర్నెట్ పై నియంత్రణ లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవలసిందే..
x
Highlights

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ రంగంలో కూడా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మనిషి రోజంతా అన్నం తినకుండా ఉండగలడేమో కానీ ఇంటర్నెట్ లేకుండా...

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ రంగంలో కూడా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మనిషి రోజంతా అన్నం తినకుండా ఉండగలడేమో కానీ ఇంటర్నెట్ లేకుండా వుండలేకపోతున్నాడనేది అర్ధమవుతున్న విషయం. భూప్రపంచం మీద నాగరిక సమాజంలో నివసించే ప్రతి 100 మందిలో 75 మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అమెరికా లాంటి అగ్రదేశాల్లో 95 శాతం ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.ఇంటర్నెట్ వలన ఎన్నో లాభాలు ఉన్నా.. మనిషి జీవితం అందులోనే తెల్లారిపోతోంది. నిద్ర లేచిన దగ్గరనుంచి మళ్ళీ నిద్ర పోయేవరకు ఇంటర్నెట్ లోనే గడుపుతున్నాడు మానవుడు.

చదువుకునే వయసులో పుస్తకాల పురుగులు కావాల్సిన పిల్లలు.. ఇంటర్నెట్ కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు వదిలిన తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు .. బ్యాగులను ఓ మూలనపడేసి ఇంటర్నెట్ వాడకంలో మునిగి తేలుతున్నారు.. ఈ చింతలో పడి చివరకు తిండిని కూడా మరిచిపోతున్నారు. గతంలో వ్యక్తిగత నైఫుణ్యానికి మెరుగులు దిద్దుకునేందుకు పుస్తకాలను బాగా చదివేవారు. ఇప్పుడంతా నెట్‌మయంగా మారిపోయింది. దీనికితోడు సోషల్‌మీడియా ప్రభావంతో సమయమంతా ఛాటింగ్‌లు, పోస్టింగ్‌లతో గడిచిపోవడంతో వృత్తిపరమైన నైఫుణ్యాలు తగ్గిపోతున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

మితిమీరిన బ్రౌజింగ్‌వల్ల మానవ మేథస్సు కుంటుపడుతుందని అంచనా. ఎక్కువ సమయం నెట్‌ వాడకంలోనే గడిపేస్తుండడంతో మెదడుకి పనిలేకుండా పోతుంది. అంతేకాదు, ఊబకాయం, కంటి సమస్యలతోపాటు మానసిక రుగ్మతలూ అధికమవుతున్నాయట. నెట్ మాయలో పడి స్నేహితులు, బంధువులు, సన్నిహితులతో కాలం గడిపే సమయమే తగ్గి పోతోంది. ఫలితంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా యువత. తీవ్రమైన వ్యాకులత, నిస్పృహ, ఒంటరితనానికి లోనౌతోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories