Bath With Hot Water: వేడినీటితో స్నానం మంచిదే.. కానీ ఈ పొరపాట్లు ప్రమాదకరంగా మారుతాయి..!

Be Careful if you Bath with Hot Water in winter these Mistakes will Become Dangerous
x

Bath With Hot Water: వేడినీటితో స్నానం మంచిదే.. కానీ ఈ పొరపాట్లు ప్రమాదకరంగా మారుతాయి..!

Highlights

Bath With Hot Water: శీతాకాలం ముదరింది చలి విపరీతంగా పెరిగింది. ఉదయం 8 గంటల వరకు మంచు దుప్పటి అలాగే ఉంటుంది. ఈ సీజన్‌లో వీచే గాలి శరీరాన్ని లోతుగా ప్రభావితం చేస్తుంది.

Bath With Hot Water: శీతాకాలం ముదరింది చలి విపరీతంగా పెరిగింది. ఉదయం 8 గంటల వరకు మంచు దుప్పటి అలాగే ఉంటుంది. ఈ సీజన్‌లో వీచే గాలి శరీరాన్ని లోతుగా ప్రభావితం చేస్తుంది. ఈ చల్లటి గాలుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు స్వెటర్లు, జాకెట్లు, ఉన్ని టోపీలు ధరిస్తారు. వీటన్నింటి మధ్య రోజూ స్నానం చేసేవారు కొందరుంటారు. వీరు వేడి నీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కండరాలను మృదువుగా చేయడానికి వేడి నీటి ఫోమెంటేషన్ ఉత్తమం. అయినప్పటికీ ప్రతిరోజూ వేడి నీటితో స్నానం చేయడం హానికరం. కొన్నిసార్లు ఇది ప్రమాదకరంగా మారుతుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

విద్యుత్ షాక్

ఇమ్మర్షన్ రాడ్ లేదా ఎలక్ట్రిక్ గీజర్ సాధారణంగా ఇళ్లలో నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు వైర్లు తెగిపోయి ఉంటాయి. గమనించకుంటే కరెంట్‌ షాక్‌కు గురై చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇమ్మర్షన్ రాడ్, ఎలక్ట్రిక్ గీజర్ వైర్లను ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తూ ఉండాలి.

గీజర్ విస్ఫోటనం

మీరు మాన్యువల్ ఎలక్ట్రిక్ గీజర్‌ను ఉపయోగిస్తుంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు ఎలక్ట్రిక్ గీజర్‌ను ఆఫ్‌ చేయడం మర్చిపోతారు. నీరు ఎక్కువసేపు వేడై గీజర్‌పేలుతుంది. అందుకే ఎలక్ట్రిక్ గీజర్ కొనేటప్పుడు ఆటోమేటిక్ గీజర్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఒక నిర్దిష్ట సమయం తర్వాత దానంతటే అది ఆఫ్ అవుతుంది.

గ్యాస్ గీజర్లలో ఈ సమస్య

మీరు గ్యాస్ గీజర్లను సురక్షితమైనవిగా భావిస్తే తప్పు చేసినట్లే అవుతుంది. చాలా సార్లు గ్యాస్ గీజర్ల నుంచి గ్యాస్ లీకేజీ కావడంతో ఊపిరాడక మరణాలు సంభవిస్తున్నాయి. మీరు బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు గీజర్ ఆన్‌లో ఉంటే నీటి ఆవిరి కారణంగా గ్యాస్ గీజర్ దానంతటే అదే ఆఫ్‌ అవుతుంది. తర్వాత దీని నుంచి గ్యాస్ లీకేజ్‌ అవుతుంది. బాత్రూమ్ తలుపు మూసివేయడం వల్ల ఊపిరాడదు. అందుకే గ్యాస్ గీజర్ ఎల్లప్పుడూ బాత్రూమ్ వెలుపల ఉండేలా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories