Top
logo

అక్కడ ఫెస్ట్ అంటే.. బీర్ బాటిల్స్ ఉండాల్సిందే..!

అక్కడ ఫెస్ట్ అంటే.. బీర్ బాటిల్స్ ఉండాల్సిందే..!
X
Highlights

జర్మనీలో మ్యూనిక్‌ నగరంలో బవేరియా స్టాచ్యూ ఉంది. 60 అడుగుల ఎత్తులో కంచుతో చేసిన ఈ స్టాచ్యూ 'ఫిమేల్‌ ఫిగర్‌...

జర్మనీలో మ్యూనిక్‌ నగరంలో బవేరియా స్టాచ్యూ ఉంది. 60 అడుగుల ఎత్తులో కంచుతో చేసిన ఈ స్టాచ్యూ 'ఫిమేల్‌ ఫిగర్‌ ఆఫ్‌ బవేరియా'గా పిలుస్తారు. 1850వ సంవత్సరంలో కింగ్‌ లుడ్‌విగ్‌ ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ స్టాచ్యూ తల భాగం దగ్గరకు వెళ్లి విగ్రహం రెండు కళ్ల నుంచీ చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ దగ్గర ఏటా అక్టోబర్‌ ఫెస్ట్‌ ఘనంగా జరుగుతుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం 1810లో ప్రిన్స్‌ లుడ్‌విగ్‌ పెళ్లి అక్కడ ఎంతో ఘనంగా జరిగిందట. పెళ్లికి 15 రోజుల ముందే రాజుగారి ఫ్రెండ్స్, బంధువులు వచ్చారట. వారు బాజాభజంత్రీలతో బీరు బ్యారెల్స్‌తో గుర్రాలమీద వూరేగింపుగా వచ్చి మరి పెళ్లి వైభవంగా జరిపించారట.

అప్పటినుంచీ దీన్ని ఓ సంప్రదాయంగా మార్చుకుని.. ప్రతి సంవత్సరం ఓ ఫెస్ట్ లా జరుపుకుంటున్నారు అక్కడి వాసులు. అక్టోబర్‌ లో మొదటి సండే కి రెండు వారాల ముందే ఈ ఫెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ పదిహేను రోజులూ స్థానికులంతా సంప్రదాయ డ్రస్సులు ధరించి, బంధుమిత్రులతో కలిసి ఫెస్ట్ లో పాల్గొంటారు. రాజుల కాలం పోయినా నగర ప్రముఖులంతా బ్యాండు మేళాలతోనూ.. బీరు బ్యారెల్సుతోనూ గుర్రపు బగ్గీల మీదా వూరేగింపుగా తరలి వస్తుండటం విశేషం. నగర మేయర్‌ పెద్ద బీరు బ్యారెల్‌ని ఓపెన్‌ చేసి వేడుక ప్రారంభిస్తారు. ఈ ఫెస్ట్ కోసం ప్రత్యేక బీర్‌ టెంట్‌లు ఏర్పాటు చేయటం మరో విశేషం.


Next Story