Child Health : పిల్లలకు కాఫీ, టీలు ఇస్తున్నారా? అయితే మీరు వారికి విషం ఇస్తున్నట్టే!

Child Health
x

Child Health : పిల్లలకు కాఫీ, టీలు ఇస్తున్నారా? అయితే మీరు వారికి విషం ఇస్తున్నట్టే! 

Highlights

Child Health : చాలామంది ఇళ్లలో ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగడం ఒక అలవాటు. పెద్దలు తాగుతుంటే పక్కనే ఉండే చిన్న పిల్లలు కూడా అడుగుతుంటారు.

Child Health : చాలామంది ఇళ్లలో ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగడం ఒక అలవాటు. పెద్దలు తాగుతుంటే పక్కనే ఉండే చిన్న పిల్లలు కూడా అడుగుతుంటారు. పాపం చిన్న పిల్లలే కదా.. కొంచెమే కదా అని గ్లాసులోనో, స్పూన్‌తోనో వారికి కూడా అలవాటు చేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఈ చిన్న అలవాటు మీ పిల్లల ఎదుగుదలపై పెను ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా? పిల్లలు సరిగ్గా అన్నం తినడం లేదని, ఎప్పుడూ నీరసంగా ఉంటున్నారని బాధపడే తల్లిదండ్రులు ముందుగా గమనించాల్సింది ఈ కెఫీన్ అలవాటు గురించి. పిల్లల ఆరోగ్యంపై కాఫీ, టీలు చూపే దుష్ప్రభావాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఐరన్ లోపం - రక్తహీనత ముప్పు

పిల్లలు ఎదిగే వయసులో వారికి ఐరన్ అత్యంత అవసరం. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్ల ద్వారా అందే ఈ పోషకాన్ని టీ లేదా కాఫీలో ఉండే కొన్ని రసాయనాలు అడ్డుకుంటాయి. మీరు మీ పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నప్పటికీ, పక్కనే కాఫీ కూడా ఇస్తే.. ఆ ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించదు. దీనివల్ల పిల్లలు తిన్నా కూడా బక్కచిక్కిపోతారు లేదా రక్తహీనత బారిన పడే అవకాశం ఉంది. ఇది వారి శారీరక ఎదుగుదలను పూర్తిగా దెబ్బతీస్తుంది.

మెదడు పనితీరుపై ప్రభావం

పెద్దలు నిద్ర మత్తు వదలడానికి కాఫీ తాగుతారు. కానీ పిల్లల నరాల వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. కాఫీలోని కెఫీన్ వారి మెదడును అతిగా ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల పిల్లల్లో ఆందోళన పెరగడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, ఒకే చోట కూర్చోలేకపోవడం, చిరాకు, మాటిమాటికీ కోపం రావడం వంటి ప్రవర్తనా మార్పులకు ఈ కెఫీన్ అలవాటే ప్రధాన కారణం. అంతేకాదు, ఇది పిల్లల నిద్రను కూడా చెడగొడుతుంది.

పిల్లలు అన్నం అడిగితే పెట్టకుండా, వారు మారాం చేస్తున్నారని లేదా టైమ్ పాస్ కోసం టీ, బిస్కెట్ ఇస్తుంటారు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆకలిని కలిగించే హార్మోన్లు అణిచివేయబడతాయి. దీనివల్ల పిల్లలకు ఆకలి వేయదు. తిండి తినకపోతే శరీరానికి శక్తి అందదు, తద్వారా వారు నీరసించిపోతారు. అంతేకాకుండా, ఇది కడుపులో ఎసిడిటీని పెంచి, మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది.

చక్కెరతో పొంచి ఉన్న ముప్పు

కాఫీ, టీలలో మనం కలిపే చక్కెర పిల్లల దంతాలను పాడు చేస్తుంది. చిన్న వయసులోనే దంత క్షయం రావడానికి ఇది ప్రధాన కారణం. అధిక చక్కెర వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్‌గా మారిపోతారు, ఇది వారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. 10 ఏళ్ల లోపు పిల్లలకు పాలు, పండ్ల రసాలు లేదా రాగి జావ వంటివి ఇవ్వడం ఉత్తమం. పిల్లల భవిష్యత్తు వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి టీ, కాఫీలకు వారిని దూరంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత.

Show Full Article
Print Article
Next Story
More Stories