వంటింట్లో బాంబు..జర జాగ్రత్త..

వంటింట్లో బాంబు..జర జాగ్రత్త..
x
Highlights

ఈ మధ్యకాలంలో వంటింటి ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా సిలిండర్ వల్ల సంభవించే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కావున సిలిండర్ వాడుతున్నప్పుడు తగిన...

ఈ మధ్యకాలంలో వంటింటి ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా సిలిండర్ వల్ల సంభవించే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కావున సిలిండర్ వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొవడం ద్వారా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని పలువురు నిపుణులు సూచి్స్తున్నారు. ఎలాంటి .జాగ్రత్తలు సాటించాలో ఓ సారి చూద్దాం..

* వంట చేయబోయే ముందు గ్యాస్ స్టవ్ పరిస్ధితిని ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి

* గ్యాస్‌ స్టవ్‌ ట్యూబ్స్‌ తరచూ మారుస్తుండాలి. స్టవ్ సంబంధించిన ట్యూబ్స్‌..రెగ్యులరేటర్స్‌ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి

* వంటగదిలో మంట త్వరగా అంటుకొనే గ్యాస్‌ స్వభావం కలిగిన వస్తువులు ఉంచకూడదు. ముఖ్యంగా సిలిండర్‌ వద్ద అలాంటి వస్తువులను ఉంచకూడదు.

* వంట గదిలో గాలి..వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి.

* గ్యాస్ లిక్ అవుతున్నట్లు అనుమానం ఉంటే గ్యాస్ కంపెనీకి లేదా అగ్నీమాపక సిబ్బందికి సమాచారం అందించాలి

* గ్యాస్‌ లీకయైనట్లుగా అనిపిస్తే సేఫ్టీపిన్‌ బిగించి ఖాళీ ప్రదేశంలో సిలిండర్‌ ఉంచాలి

* వంట చేసే సమయంలో గిన్నె నుండి మంట వస్తే వెంటనే దానిపై మూత పెట్టేసి బర్నర్‌ బంద్‌ చేయాలి.

* గ్యాస్‌ను ఉపయోగించిన తర్వాత రెగ్యులేటర్‌ని బంద్‌ చేయాలి

* వంట గది తలుపు కింద అర అంగుళం ఖాళీ ఉండాలి.

* ఎలక్ట్రానిక్ వస్తువులను గ్యాస్ దగ్గరగా ఉంచి ఉపయోగించకుడాదు.

* గ్యాస్‌ స్టవ్‌...రిఫ్రిజిరేటర్‌..ఒకే చోట ఉండకుండా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories