Asthma Attack: ఆస్తమా అటాక్‌ చాలా డేంజర్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించండి..!

Asthma Attack Is Very Dangerous Consult A Doctor If You See These Symptoms
x

Asthma Attack: ఆస్తమా అటాక్‌ చాలా డేంజర్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించండి..!

Highlights

Asthma Attack: ఆస్తమా చాలా ప్రమాదకరమైన వ్యాధి. మన దేశంలో ఈ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Asthma Attack: ఆస్తమా చాలా ప్రమాదకరమైన వ్యాధి. మన దేశంలో ఈ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేదు. దీనిని సకాలంలో కంట్రోల్‌ చేయకపోతే ప్రాణాలు పోతాయి. కొంతమంది ఈ వ్యాధిని గుర్తించలేరు. అందుకే ప్రతి ఒక్కరూ దీనిపై అవగా హన కలిగి ఉండాలి. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఎంతకీ నయం కాదు. అందుకే రాకముందే జాగ్రత్తలు పాటించడ ఉత్తమం. ఈ రోజు ఆస్తమా అంటే ఏమిటీ.. దీని లక్షణాలు, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం.

నిజానికి ఆస్తమా అనేది ఒక ఊపిరితిత్తుల వ్యాధి. ఇందులో శ్వాసనాళాలు వాపుకు గురై కుంచించుకుపోతాయి. దీని కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. శ్వాసనాళంలో శ్లేష్మం రావడం ప్రారంభమవుతుంది. దీర్ఘకాలం సమస్య కొనసాగితే అది ప్రాణాంతకం అవుతుంది. . ఆస్తమా ఏ వయసులోనైనా రావచ్చు. కానీ పిల్లలు, వృద్ధులు ఎక్కువగా దీని బారినపడుతారు. దేశంలో పెరుగుతున్న కాలుష్యమే ఈ వ్యాధికి కారణం.

లక్షణాలు ఏమిటి?

1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

2. ఛాతీలో బిగుతుగా ఉన్న భావన

3. కఫంతో కూడిన దగ్గు

4. నిద్రలో ఛాతీలో గురక

ఆస్తమా చికిత్స

ఆస్తమాను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దీనిని కంట్రోల్‌ చేయడ వరకే సాధ్యమవు తుంది. ఒక వ్యక్తిలో ఆస్తమా దాడి అతని రోగనిరోధక వ్యవస్థ వల్ల కూడా వస్తుంది. ఈ రకమైన సమస్యకు శాశ్వత చికిత్స కష్టం అవుతుంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదు. మంచి జీవనశైలి, మంచి ఆహారం, ఇన్‌హేలర్ వాడడం వల్ల ఈ వ్యాధిని నియంత్రించ వచ్చు. మీ చుట్టూ పరిశుభ్రతను కాపాడుకోవాలి. దుమ్ము, బురద, పొగ నుంచి రక్షణ పొందాలి. క్రమం తప్పకుండా యోగా చేయాలి. ఎక్కువ నూనె పదార్థాలు తినకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories