Rose Water: రోజ్‌ వాటర్‌తో మెరిసే అందం మీ సొంతం.. ఇలా అప్లై చేయండి..!

Applying Rose Water on the Face Makes the Skin Beautiful Know the Benefits of Rose Water
x

Rose Water: రోజ్‌ వాటర్‌తో మెరిసే అందం మీ సొంతం.. ఇలా అప్లై చేయండి..!

Highlights

Rose Water: ఇందులో మొటిమలు, డార్క్‌ స్పాట్స్ వంటివి ముఖ్యంగా చెప్పవచ్చు. మీరు కూడా చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రోజ్ వాటర్ ఉపయోగించండి.

Rose Water: నేటి రోజుల్లో ప్రజలు సరైన ఆహారం తీసుకోకపోవడం, ఇంకా ఒత్తిడి కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో మొటిమలు, డార్క్‌ స్పాట్స్ వంటివి ముఖ్యంగా చెప్పవచ్చు. మీరు కూడా చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రోజ్ వాటర్ ఉపయోగించండి. ఇది చర్మంలోని అదనపు ఆయిల్‌ని తొలగిస్తుంది. దీంతో ముఖంపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. ముఖానికి రోజ్ వాటర్ ఎలా అప్లై చేయవచ్చో తెలుసుకుందాం.

రోజ్ వాటర్ తో మసాజ్

ముఖం మీద మొటిమలు ఉంటే రోజ్ వాటర్‌తో మసాజ్ చేయాలి. దీనివల్ల మొటిమలు తగ్గుతాయి. కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని దానిని ముఖానికి అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి.

రోజ్ వాటర్, కలబంద

ముఖం పొడిగా, నిర్జీవంగా ఉంటే రోజ్ వాటర్, అలోవెరా జెల్ మిక్స్ చేసి అప్లై చేయాలి. దీన్ని ముఖంపై 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఈ విధంగా రోజుకు 3 సార్లు చేయాలి.

రోజ్ వాటర్, గంధపు పొడి

ముఖంపై ఉన్న మొటిమల గురించి ఆందోళన చెందుతుంటే రోజ్ వాటర్, గంధపు పొడిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. దీనివల్ల మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు. గంధపు పొడి చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది ముఖం ఎరుపును తగ్గిస్తుంది. మొటిమలను నయం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories