లిప్‌స్టిక్ తయారిలో వాడే గింజలు ఏంటో తెలుసా..!

లిప్‌స్టిక్ తయారిలో వాడే గింజలు ఏంటో తెలుసా..!
x
Highlights

పెదాలకు లిప్ స్టిక్ ఉంటే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుందని చాల మంది బావిస్తుంటారు. అందం గురించి ఎదుటి వారికి తెలియాలంటే పెదాలు స్మూత్ గా.. సాప్ట్ గా...

పెదాలకు లిప్ స్టిక్ ఉంటే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుందని చాల మంది బావిస్తుంటారు. అందం గురించి ఎదుటి వారికి తెలియాలంటే పెదాలు స్మూత్ గా.. సాప్ట్ గా ఉండాలి. మగువలు పెదాలు అందంగా కనబడాలని లిప్ స్టిక్‌ని వాడుతుంటారు. ముద్దుగుమ్మల పెదాల నుంచి జాలువారే నవ్వులకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. అంత అందగా ఉండే పెదాలకు రంగులద్దిన లిప్‌స్టిక్‌లును ఎలా తయారు చేస్తారో తెలుసా.. అనాటో మొక్క నుంచి. సింధూరీ, జాఫ్రా అని పిలిచే ఈ మొక్క.. కాయలు, గింజల నుంచి వచ్చే రంగును లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు.

పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఈ జాఫ్రా పంట ఎక్కువగా ఉంది. ఈ పంటకు సాగుకు భూమి ఎక్కువగా ఉండాలి. పూర్తి నీటి సదుపాయాలు కలిగి ఉండాలి. పొడిగా ఉండే భూమి జాఫ్రా పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే పంట చేతికి వస్తుంది. ఒక్కసారి నాటిన జాఫ్రా మొక్క దాదాపు 25 సంవత్సరాల పాటు కాపు ఇస్తూనే ఉంటుంది.

అయితే జాఫ్రా పంటకు సరైన మార్కెటింగ్ లేకపోవటం బాధకరం. కిలో జాఫ్రా గింజలు రూ.80 నుంచి రూ.100వరకు ధర పలుకుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధర దాదాపు రూ.1000 నుంచి 1200 వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories