బంగాళా దుంపలు, టమాటాలు పుట్టింది ఎక్కడో తెలుసా..!

బంగాళా దుంపలు, టమాటాలు పుట్టింది ఎక్కడో తెలుసా..!
x
Highlights

టమాటాలు లేకుండా వంట చేయడం అంటే కష్టమనే చెప్పాలి. మన సంస్కృతులకు చెందిన వంటకాల్లో టమాటా తప్పకుండా ఉంటుంది. గృహిణిలు ఎక్కువగా చేసే వంటలు టమాటా మరియు...

టమాటాలు లేకుండా వంట చేయడం అంటే కష్టమనే చెప్పాలి. మన సంస్కృతులకు చెందిన వంటకాల్లో టమాటా తప్పకుండా ఉంటుంది. గృహిణిలు ఎక్కువగా చేసే వంటలు టమాటా మరియు బంగాళ దుంప. ఇక ఎదైనా పంక్షన్ జరిగితే టమటా, బంగాళదుంప తప్పుకుండ ఉండాల్సిందే. ఇక ఇంట్లో కూరగాయలు పెంచుకునేవాళ్ళు ఇతర కూరగాయల మొక్కలకంటే టమాటా మొక్కలనే ఎక్కువగా పెంచుతారు. ఒక ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా టమాటాలు, బంగాళా దుంపలు

అందరికీ ఆహారంలో భాగమే. వంటల్లో ఎంతో ముఖ్యమైన ఈ టమాటా, బంగాళదుంప పెట్టింది ఎక్కడ తెలుసా.. ఆండిస్‌ పర్వతాల్లో.

ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి ఇది. ఇక్కడ పర్వతాలు గొలుసుకట్టుగా చాలా పొడుగుంటాయి. మొత్తం ఏడు దేశాలు.. వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, బొలీవియా, చిలీ, అర్జెంటీనాలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడున్న లేక్‌ టిటికాకా ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న సరస్సు. పెద్ద నదుల్లో ఒకటిగా చెప్పుకొనే అమెజాన్‌ నది పుట్టింది ఈ శ్రేణుల్లోనే. ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు గని కూడా ఇక్కడే ఉండటం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories