ఆపిల్‌లో మిలియన్ల బ్యాక్టీరియా!

ఆపిల్‌లో మిలియన్ల బ్యాక్టీరియా!
x
Highlights

తి రోజూ ఆఫిల్ తినడం వల్ల అరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిందే. వాటిలో ఉండే పోషకాలు హెల్త్‌కు ఎంతో మెలు చేస్తాయని వాటిలోని విటమిన్ కె, విటమిన్ సి,...

తి రోజూ ఆఫిల్ తినడం వల్ల అరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిందే. వాటిలో ఉండే పోషకాలు హెల్త్‌కు ఎంతో మెలు చేస్తాయని వాటిలోని విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించుకోవాలని అనుకునేవారు ఆపిల్ తినాలని సూచిస్తారు. కానీ ఇది అంతా నాణేనానికి ఒక్కవైపు మాత్రమే.. 240 గ్రాముల బరువున్న ఆపిల్‌లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందంటా! ఈ బ్యాక్టీరియా కారణంగా ఒక్కోసారి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధరులు చెబుతున్నారు. కావున ఆపిల్‌ పండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోని కోనాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆపిల్ పండ్లను ఆర్గానిక్, సంప్రదాయ పద్ధతుల్లో పండిస్తారు. ఈ రెండింటిలోనూ బ్యాక్టీరియా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆపిల్ పండ్లలో బ్యాక్టీరియా ఎక్కువగా గింజల్లోనే ఉంటుంది. పండులో బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటుంది. ఆర్గానిక్ ఆపిళ్లలో ప్రొబయోటిక్ లాక్టోబసిల్లీ బ్యాక్టీరియా, మెథైలోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియాలు ఉంటాయి.మన పేగులకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఆర్గానికి ఆపిల్ పండ్లలో ఉంటుంది. అది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాబట్టి సంప్రదాయ రీతిలో పండించిన ఆపిళ్ల కంటే.. ఆర్గానిక్ ఆపిల్ పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories