Soaked Raisin Water: ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీరు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే రాత్రి వీటిని నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే మరింత ప్రయోజనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల శరీరానికి కలిగే ముఖ్యమైన లాభాలు ఇలా ఉన్నాయి:

Ramya Vegirouthu
Published on: 11 Sept 2025 6:50 AM IST
ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీరు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
X

ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీరు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే రాత్రి వీటిని నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే మరింత ప్రయోజనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల శరీరానికి కలిగే ముఖ్యమైన లాభాలు ఇలా ఉన్నాయి:

హృదయ ఆరోగ్యం:

ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు గుండెకు మేలు చేస్తాయి. అలాగే పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె సమస్యలు, స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రక్తహీనత నివారణ:

ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఈ నీటిని తాగితే అలసట తగ్గి, రక్తహీనత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో ఆక్సిజన్ ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

రక్తపోటు నియంత్రణ, ఎముకల బలానికి:

ఎండుద్రాక్ష నీటిలోని ఫైబర్, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే కాల్షియం ఎముకలను బలపరచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుదల:

ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది.

అందువల్ల ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీటిని తాగే అలవాటు చేసుకుంటే శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story