మిరియాలతో లాభాలు ఎన్నో..

మిరియాలతో లాభాలు ఎన్నో..
x
Highlights

నల్ల మిరియాలు మనదేశంలో చాలా విరివిగా పండుతాయి. ఆహారంలో మంచి రుచి రావడానికి వీటిని వాడుతారు. ఏదైనా జలుబు లాంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మిరయాలను...

నల్ల మిరియాలు మనదేశంలో చాలా విరివిగా పండుతాయి. ఆహారంలో మంచి రుచి రావడానికి వీటిని వాడుతారు. ఏదైనా జలుబు లాంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మిరయాలను ఔషధంగా కూడా వాడుతారు. మిరియాలను ఎక్కువగా వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మిరియాల్లో నల్లవే కాకుండా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. వీటితో ఉపయోగాలు ఏమిటో చూద్దాం.

1. మిరియాలను పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా కూడా ఉపయోగిస్తారు. దీంతో తలనొప్పి వంటి దీర్ఘవ్యాధులు నయమవుతాయి.

2. ఘాటైన వాసనను కలిగి ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగిస్తాయి. గ్రాము మిరియాలు తీసుకుని వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమాన్ని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. ఇది జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరం చెస్తుంది.

3. లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి పంపి రక్తప్రసరణ వేగవంతమయేలా చేస్తుంది .

4.కొవ్వు ఎక్కువుగా పేరుకోకుండా చేసి. స్వేద ప్రక్రియ వేగవంతం చేస్తుంది . మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి.

5.చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకుని, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు తగ్గి రక్తం రావడం వంటివి తగ్గుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories