Alum : పటికతో అద్భుత ప్రయోజనాలు – ఇంట్లోనే సహజ చికిత్సలు

Alum : పటికతో అద్భుత ప్రయోజనాలు – ఇంట్లోనే సహజ చికిత్సలు
x

Alum : పటికతో అద్భుత ప్రయోజనాలు – ఇంట్లోనే సహజ చికిత్సలు

Highlights

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి ఎప్పుడూ డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇళ్లలో సులభంగా దొరికే కొన్ని సహజ పదార్థాలతోనే వాటిని తగ్గించుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి పటిక. ఇది అనేక ప్రయోజనాలు కలిగిన పదార్థం. ఇప్పుడు పటిక వలన లభించే ఉపయోగాలు, ఆయుర్వేదంలో దాని ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం.

పటిక అంటే ఏమిటి?

పటికను అల్యూమినియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్ కలిపి తయారు చేస్తారు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, గృహ చికిత్సల్లో దీన్ని విస్తృతంగా వాడుతారు.

పటిక వలన లభించే ప్రయోజనాలు:

చర్మం, ముఖ సౌందర్యం

మొటిమలు, మచ్చలు తగ్గించడంలో పటిక సహాయకారి. పటిక పొడిని రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. గొంతు నొప్పి లేదా పొడి దగ్గు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో పటిక పొడి వేసి పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది.

గాయాలు, పుండ్లకు మందు

చిన్న గాయాలు, పుండ్లపై పటిక పొడిని పాలలో కలిపి రాస్తే రక్తస్రావం ఆగి గాయం త్వరగా మానిపోతుంది.

సహజ డియోడరెంట్

అధిక చెమట వాసనతో బాధపడేవారికి పటిక సహజ డియోడరెంట్‌లా పనిచేస్తుంది. స్నానం తర్వాత చంకలకింద పటిక ముక్క రుద్దితే చెమట వాసన తగ్గుతుంది. అలాగే పాదాలను పటిక నీటిలో నానబెడితే పాదాల దుర్వాసన తొలగిపోతుంది.

జుట్టు ఆరోగ్యం

చుండ్రుతో జుట్టు రాలిపోతే, కొబ్బరి నూనెలో పటిక పొడి కలిపి మసాజ్ చేస్తే సమస్య తగ్గి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

చెవి నొప్పి తగ్గింపు

పటిక పొడిని కొబ్బరి నూనెలో కలిపి చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది.

నోటి ఆరోగ్యం

నోటి దుర్వాసనకు పటిక పొడిని గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలిస్తే దుర్వాసన తగ్గి పళ్లు శుభ్రంగా ఉంటాయి.

జాగ్రత్తలు:

పటికను అధికంగా వాడరాదు.

నేరుగా నోటిలో వేసుకోవద్దు.

అధిక వాడకం వల్ల చర్మం పొడిబారడం లేదా చికాకు కలగవచ్చు.

ఆరోగ్య సమస్యలకు పటిక వాడే ముందు నిపుణుల సలహా తప్పనిసరి.

Show Full Article
Print Article
Next Story
More Stories