Alia Bhatt: ఆలియా భట్ లుక్ మీకు నచ్చుతుందా?..మీరూ అలా ట్రై చేయాలనుకుంటున్నారా?...అయితే ఆలియా చెప్పిన ఈ టిప్స్ ఫాలోఅయిపోండి

Alia Bhatt
x

Alia Bhatt: ఆలియా భట్ లుక్ మీకు నచ్చుతుందా?..మీరూ అలా ట్రై చేయాలనుకుంటున్నారా?...అయితే ఆలియా చెప్పిన ఈ టిప్స్ ఫాలోఅయిపోండి

Highlights

Alia Bhatt: ఆలియా అంటేనే అందం. అందం అంటేనే ఆలియా అన్నట్టు ఆమె లుక్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఆమె ఒక స్పెషల్ అట్రాక్షనే అవుతుంది. సింపుల్ మరియు అట్రాక్టివ్ మేకప్‌తో కనిపించే ఆలియా తన బ్యూటీకోసం ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తానని చెబుతుంది.

Alia Bhatt: ఆలియా అంటేనే అందం. అందం అంటేనే ఆలియా అన్నట్టు ఆమె లుక్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఆమె ఒక స్పెషల్ అట్రాక్షనే అవుతుంది. సింపుల్ మరియు అట్రాక్టివ్ మేకప్‌తో కనిపించే ఆలియా తన బ్యూటీకోసం ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తానని చెబుతుంది.

1 జువెలరీ మ్యాచింగ్ లిఫ్ట్ స్టిక్

ఏ డ్రెస్సు వేసుకున్నా అది ఎలివేట్ అవ్వాలంటే దానికి తగ్గ జువెలరీ ఉండాలి. అంతేకాదు దానికి తగ్గ మేకప్ కూడా ఉంటేనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగలుగుతారు. అందుకే ఆలియా కరెక్ట్ లిఫ్ స్టిక్ సెలెక్ట్ చేసుకోవాలని చెబుతుంది. జువలరీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా డ్రెస్సుని బట్టి వేసుకోవాలిని అంటుంది. ఉదాహరణకు ఒక మ్యారేజ్ పార్టీకి వెళుతున్నప్పుడు ప్లెయిన్ సారీని ప్రిఫెర్ చేస్తే.. దానికి హెవీ జువలరీ పెడితే బావుంటుంది. అలాగే డార్క్ లిప్ స్టిక్ వేస్తే బావుంటుంది.

2 మినిమలిజమ్ చాలా బెటర్

తక్కువ వేసుకోండి..ఎక్కువ ఎలివేట్ అవ్వండి అని ఆలియా చెబుతోంది. కొందరు చిన్న పార్టీ అయినా, పెద్ద పార్టీ అయినా ఒకేలా తయారవుతారు. దానివల్ల ఎలా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. అందుకే చిన్న పార్టీలకు తక్కువ జువెలరీ వాడండి. పెద్ద పార్టీలకు ఎక్కువ జువెలరీ వాడితే బావుంటుంది.

3 నేచురల్ గ్లో చాలా ముఖ్యం

ఎవరైనా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నారంటే వాళ్లు నేచురల్ లుక్‌లో ఉన్నారని అర్థం. తాను నేచురల్ గ్లో అలాగే సన్ కిస్డ్ ఫీల్‌ని ఇష్టపడతానని ఆలియా చెప్పింది. లైట్ మేకప్ చేసుకుంటే తొందరగా చెరిగిపోతుంది అనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే లైట్ మేకప్‌ని కూడా కరెక్ట్‌ గా వేసుకోండి. అలాగే ఒక మంచి సెట్టింగ్ స్ర్పే కి స్ప్రిట్జ్ యాడ్ చేయండి. లేదంటే ఏదైనా గ్లో ఫౌండేషన్‌ను వాడండి. మీరు అందంగా కనిపిస్తారు.

4 సన్ స్క్రీన్ మరిచిపోవద్దు

బయటకు ఎప్పుడు వెళ్లినా సన్ స్క్రీన్ వాడండి. అలాగే సన్ కిస్డ్ ఫినిషింగ్ కావాలంటే సరైన బ్లష్​లను ఉపయోగించండి. నేను ఎప్పుడూ సన్ స్క్రీన్‌ని మిస్ చేయను. మీరూ చేయకండి.

5 లిప్ బామ్ తప్పనసరి

ఎన్ని లిప్ స్టిక్‌లు ఉన్నా లిప్ బామ్ ఆలియా చాలా ఇష్టం. లిప్ బామ్స్ అలాగే లిప్ ఆయిల్స్ ని తాను ఎంతగానో ఇష్టపడతానని ఆలియా చెబుతుంది. వీటితో పాటు సరైన ఐ లాష్ కర్లర్ తో మీ కళ్లను దిద్దుకుంటే మీ లుక్కే మారిపోతుంది.

మరింకెందుకు ఈ సింపుల్ టిప్స్‌ని ఫాలో అయి మీ లుక్ ని ఇప్పుడే మార్చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories