గాల్లేని టైర్లు.. ఎలాంటి రోడ్లపై అయినా దూసుకెళ్లొచ్చు!

గాల్లేని టైర్లు.. ఎలాంటి రోడ్లపై అయినా దూసుకెళ్లొచ్చు!
x
Highlights

గాల్లేని టైర్లు.. ఇలాంటి టైర్లు కూడా ఉంటాయా అని ఆలోచిస్తున్నారా..! బస్సు, ట్రక్‌, కారు, బైక్.. వాహనం ఏదైనా సరే వాటి టైర్లలో గాలి ఉంటుంది. టైర్లలో...

గాల్లేని టైర్లు.. ఇలాంటి టైర్లు కూడా ఉంటాయా అని ఆలోచిస్తున్నారా..! బస్సు, ట్రక్‌, కారు, బైక్.. వాహనం ఏదైనా సరే వాటి టైర్లలో గాలి ఉంటుంది. టైర్లలో ఉండాల్సినదాని కన్నా గాలి ఎక్కువైనా లేక తక్కువైనా బండి ముందుకు సాగదు. టైర్లలో గాలి తక్కువైన తంటే.. ఎయిర్ ఎక్కువగా ఉన్న ప్రమాదమే. ఉండాల్సిన గాలిలో ఏమాత్రం తేడా వచ్చినా టైరు ఆయుష్షు తగ్గిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటివి జరగుకుండా ఉండాలంటే టైర్లలో ఎయిర్ తరచూ చెక్‌ చేయడం తప్పనిసరి.

టైర్లలో గాలి చెక్ చేసుకోవడం కొంత మందికి చిరాకుగా ఉంటుంది. ఎయిర్ కోసం మెకానిక్ షాపుకు వెళ్లటం కొందరికి అసలు ఇష్టం ఉండదు. ఇక గాలి లేని టైర్లు ఉంటే ఎంత బాగుంటుందో అనుకునే ఉన్నారు. అలాంటి వారికి పొలారిస్ కంపెనీకి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అందేమిటంటే 'ఎయిర్‌లెస్‌ టైర్‌'.

పొలారిస్‌ కంపెనీ ఇంజినీర్లంతా రెండేళ్లు తమ రీసెర్చ్‌ సెంటర్లలో కష్టపడి 'ఎయిర్‌లెస్‌ టైర్‌' రూపొందించారు. తేనెగూడులాంటి స్పోక్స్‌ ఇరుసుగా ఉంటుంది. దీని సహాయంతో ఎలాంటి రోడ్లపై అయినా దూసుకెళ్లొచ్చు. విపరీతమైన వేడిని తట్టుకుంటుంది. పైగా ఇది షాక్‌ రెసిస్టెన్స్‌, బుల్లెట్‌ప్రూఫ్‌. త్వరలోనే వీటిని అందరికీ అందుబాటులోకి తెస్తామంటుంది పొలారిస్ కంపెనీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories