ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..!

ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..!
x
Highlights

ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి చూడాలంటే చాల మంది భయపడిపోతారు. మరికొంత మంది అయితే అమ్మో.. అంతా ఎత్తుకి అంటేనే గజగజా వణికిపోతారు.చాల తక్కువ మంది ఎత్తైన...

ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి చూడాలంటే చాల మంది భయపడిపోతారు. మరికొంత మంది అయితే అమ్మో.. అంతా ఎత్తుకి అంటేనే గజగజా వణికిపోతారు.చాల తక్కువ మంది ఎత్తైన ప్రదేశంలో నివసించటానికి ఇష్టపడుతుంటారు. ఎత్తైన ప్రదేశంలో ఆక్సిజన్ చాల తక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కొంత మంది మాత్రం ఆడుతూ పాడుతూ ఎత్తైన ప్రాంతాల్లో హాయిగా జీవించేస్తారు. ఇంతకీ అక్కడ వాళ్లు అలా ఎలో ఉంటున్నారో తెలుసా.. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నవర్రాకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎత్తైన ప్రాంతాల్లో నివసించే వారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. మరో విశేషం ఎంటంటే ఎత్తైన ప్రాంతాల్లో నివసించే వారిలో గుండె జబ్బులు, డయాబెటిస్‌, స్ట్రోక్‌ వంటి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సముద్రమట్టానికి అతి తక్కువ ఎత్తులో నివసిస్తున్న వారితో పోల్చితే 457 నుంచి 2297 మీటర్ల ఎత్తులో నివసిస్తున్న వారిలో జీవక్రియల లోపాలు ( అధిక రక్తపోటు, షుగర్‌ లెవెల్స్‌ పెరగడం ) వంటివి తలెత్తే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అంత ఎత్తులో ఉండటం ఊపిరితిత్తుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు ఒక్కసారి శ్వాస తీసుకుంటే శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ ఆక్సీజన్ అందుతుంది. దీంతో ఎక్కువసేపు శ్వాస తీసుకోకుండా ఉండగల్గుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories