4కె ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ విడుదల..

4కె ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ విడుదల..
x
Highlights

ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ మరో అడుగు ముందుకేసింది. యాక్ట్‌ స్ట్రీమ్‌ టీవీ 4కె పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్‌...

ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ మరో అడుగు ముందుకేసింది. యాక్ట్‌ స్ట్రీమ్‌ టీవీ 4కె పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్‌ 9.0 పై ఓఎస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 2జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, 1 ఈథర్‌నెట్‌ పోర్టు, 1 హెచ్‌డీఎంఐ పోర్టు, 1 ఏవీ అవుట్‌పుట్‌, 2 యూఎస్‌బీ పోర్టులు, 1 ఎస్‌డీ కార్డు స్లాట్‌ తదితర ఫీచర్లు ఈ బాక్స్‌లో రానున్నాయి. దీని ద్వారా వీక్షకులు టీవీలో వీడియోలు, సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్‌ వీడియోలను వీక్షించవచ్చు.

అలాగే ప్రొడక్షన్ సంస్థలు అయినా నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌ స్టార్‌, సోనీ లివ్‌, హూక్‌, జీ5, యూట్యూబ్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీ తదితర యాప్‌లకు ఈ బాక్స్‌లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీంతో ఆయా యాప్‌ల నుంచి వీడియోలను స్ట్రీమ్‌ చేస్తూ వీక్షించవచ్చు. ఇక ఈ యాక్ట్‌ స్ట్రీమ్‌ టీవీ 4కె బాక్స్‌ రూ.4499 ధరకు వినియోగదారులకు మే నెలలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. కాగా యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వాడుతున్న వినియోగదారుల్లో ఎంపిక చేసిన 5వేల మందికి ఈ బాక్స్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ సంస్థప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories