AC Side Effects: ఏసీలో పడుకోవడం వల్ల ఎముకలు నిజంగా కరిగిపోతాయా?

AC Side Effects
x

AC Side Effects: ఏసీలో పడుకోవడం వల్ల ఎముకలు నిజంగా కరిగిపోతాయా?

Highlights

AC Side Effects: మనలో చాలా మంది ACలో పడుకోవడానికి ఇష్టపడతారు. రోజంతా అలసట తర్వాత రాత్రిపూట చల్లని గాలిలో నిద్రపోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అయితే, అలా ఏసీలో ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఎముకలు కరిగిపోతాయని చాలా మంది అంటారు.

AC Side Effects: మనలో చాలా మంది ACలో పడుకోవడానికి ఇష్టపడతారు. రోజంతా అలసట తర్వాత రాత్రిపూట చల్లని గాలిలో నిద్రపోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అయితే, అలా ఏసీలో ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఎముకలు కరిగిపోతాయని చాలా మంది అంటారు. అయితే, ఇందులో నిజమెంత? AC నిజంగా మన శరీర ఎముకలపై చెడు ప్రభావాన్ని చూపుతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

AC వాడే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనిని ఎక్కువగా వాడటం వల్ల మీ శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా వృద్ధులకు, పిల్లలకు మంచిది కాదని సూచిస్తున్నారు. AC నేరుగా ఎముకలను కరిగించదని, కానీ చల్లని వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరంలో కొన్ని శారీరక మార్పులు ఖచ్చితంగా వస్తాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కండరాలు, కీళ్ళు గట్టిగా అనిపించవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఎక్కువగా ఇబ్బంది పడతారు.

శరీరంపై AC ప్రభావాలు

* తీవ్రమైన చలిలో ఉండటం రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది ఎముకల రక్షణను కూడా బలహీనపరుస్తుంది.

* ఏసీలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు సూర్యరశ్మికి దూరంగా ఉంటారు. దీనివల్ల శరీరంలో ఎముకలకు అవసరమైన విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.

* AC గాలిని పొడిగా చేస్తుంది. ఇది చర్మం, కీళ్లలో పొడిబారడానికి కారణమవుతుంది.

ACని ఎలా ఉపయోగించాలి?

* AC ఉష్ణోగ్రతను చాలా తక్కువగా ఉంచకండి. 24–26 డిగ్రీలు సురక్షితమైన ఉష్ణోగ్రత.

* చల్లని గాలి నేరుగా శరీరంపై పడనివ్వకండి.

* శరీరానికి విటమిన్ డి లభించేలా ఎండలో కొంత సమయం గడపండి.

* కీళ్లకు నూనెతో మసాజ్ చేయండి. ఇది పిల్లలకు, వృద్ధులకు చాలా ముఖ్యం.

ఏసీలో పడుకోవడం వల్ల ఎముకలు నేరుగా కరగవు, కానీ దానిని అధికంగా లేదా తప్పుగా వాడటం వల్ల శరీరానికి ఖచ్చితంగా హాని కలుగుతుంది. కాబట్టి, పై జాగ్రత్తలతో మీరు ACని ఆస్వాదిస్తూ, ఆరోగ్యంగా ఉండండి.

Show Full Article
Print Article
Next Story
More Stories