AC: ఎయిర్‌ కండిషన్‌ పేలి ఢిల్లీలో ఓ వ్యక్తి మృతి.. ఏసీ ఉన్న ప్రతిఒక్కరూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

AC: ఎయిర్‌ కండిషన్‌ పేలి ఢిల్లీలో ఓ వ్యక్తి మృతి.. ఏసీ ఉన్న ప్రతిఒక్కరూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
x
Highlights

AC Safety Precautions: ఎండాకాలం వచ్చింది.. దీంతో అందరూ ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్ ఆన్ చేస్తారు. చల్లని గాలి కోసం కొత్త ఏసీలు కూడా కొనుగోలు చేస్తారు.

AC Safety Precautions How to Prevent AC Explosions and Stay Safe

AC Safety Precautions: ఇటీవల ఢిల్లీలో ఆ వ్యక్తి ఏసీ పేలడంతో చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. అందుకే ఏసీ ఉన్న ప్రతి ఒక్కరు కొన్ని నియమాలను పాటించాలి. తద్వారా ప్రమాదాల నుంచి బయటపడతారు. ఏసీ రిపేర్ షాప్‌లో వాటికి మరమ్మతులు చేస్తుండగా ఎలక్ట్రికల్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

ఢిల్లీలోని కృష్ణా నగర్ లో ఏసీ బ్లాస్ట్ అవ్వడంతో వ్యక్తి చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మోహన్ లాల్‌ అనే వ్యక్తి ఏసీ పేలడంతో మరణించిన వీడియో సిసిటీవీలో కూడా నమోదయింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కూడా అయింది. అయితే ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు. గతంలో కూడా ఏసీ పేలి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఏసి ఉన్న ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలి..

ఏసీ జాగ్రత్తలు ఇవే..

కంప్రెసర్ అనేది ప్రతి విండో లేదా స్ప్లిట్ ఏసీ కి ఒక గుండె వంటిది. ఇది అతిగా వేడెక్కితే కూడా పేలిపోయే ప్రమాదం ఉంది.

అంతేకాదు మీ ఏసికి కనెక్ట్ అయి ఉన్న వైర్లు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. డ్యామేజ్ అయిన వైరింగ్ వల్ల ఎలక్ట్రిక్ సర్క్యూట్ జరిగి కూడా ఏసి పేలిపోయే ప్రమాదం ఉంది.

అంతేకాదు ఏసీ వినియోగించే ప్రతిసారి ఎలక్ట్రికల్ వైరింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి.

హఠాత్తుగా ఓల్టేజ్ పెరిగినా కానీ ఏసీలోని ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.

అందుకే ఎప్పుడూ వోల్టేజ్ స్టెబిలైజర్ వినియోగించాలి. తద్వారా ఏసీ ప్రమాదాల నుంచి బయటపడతారు.

అంతేకాదు రిఫ్రిజిరేటర్ నుంచి గ్యాస్ లీక్ అయినా కానీ ఏసీ పేలే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు ఈ గ్యాస్ లెవెల్స్ ఏసి ప్రొఫెషనల్ తో చెక్ చేస్తూ ఉండాలి.

రెగ్యులర్ గా ఏసీ సర్వీసింగ్ చేయించడం అలవాటు చేసుకోవాలి. ఫిల్టర్స్ లో దుమ్ము ఎక్కువగా పేరుకున్న కానీ ఎక్కువ ప్రెషర్ వల్ల ఏసీ పేలిపోయే ప్రమాదం ఉంది.

చాలా రోజుల తర్వాత ఏసీ మళ్లీ వాడుతున్నట్లయితే కచ్చితంగా ప్రొఫెషనల్ తో ముందుగా చెక్ చేయించుకోవడం మంచిది.

ఏసి ఉన్న ప్రదేశంలో సరైన వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా అతిగా వేడెక్కకుండా ఉంటుంది.

గ్యాస్ లీక్ అవుతుందా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. వోల్టేజ్ స్టెబిలైజర్ వాడటం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చు. ఎప్పటికప్పుడు ఫిల్టర్లను కూడా క్లియర్ చేస్తూ ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories