Garlic Health Benefits: డయాబెటీస్ ను కంట్రోల్ చేసే వెల్లుల్లి

8 Incredible Garlic Health Benefits for Women and Men
x

Garlic Health Benefits

Highlights

Garlic Health Benefits: పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ అవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Garlic Health Benefits: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మన పెద్దవారు. అదేనండి మన వెల్లుల్లి. మనందరం రెగ్యులర్ వాడుతూనే వుంటాం. ఉల్లి లో ఎర్రగడ్డ, తెల్లగడ్డ అని రెండు రకాలు వుంటాయి. ఈ రోజు మనం వెల్లుల్లి గురించి తెలుసుకుందాం. దాని లో వుంటే ఘాటలైన వాసన వల్ల కొంత మంది దీనిని అన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. మరి కొంత మంది దానిని దరిచేరనివ్వరు. అంతే కాదు అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని మనం సొంత చేసుకోవచ్చు ఈ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల. అస్సలు వెల్లుల్లి లో వుంటే ఆరోగ్య రహస్యాలు ఏంటో మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, సూక్షక్రిములను చంపేసే యాంటీమైక్రోబయల్, విషవ్యర్థాలను బయటకుపంపే యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు.

జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది. ఇది లింఫ్‌ గ్రంధుల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటికి పంపటంలో సహకరిస్తుంది. వెల్లుల్లి అరుగుదలకు ఉపయోగపడే రసాలను ప్రేరేపిస్తుంది. వెల్లుల్లిని ముద్దలుగా నూరి పాలతో గాని నీటితో గాని కలిపి సేవిస్తే అరుగుదల చక్కగా ఉంటుంది.

జ్వరాల నుంచి త్వరగా కోలుకోవడానికి, రొంప నుంచి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిలోని అవశ్య తైలాలు ఉంటాయి. ఈ గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం.

బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన మందుగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడి చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం లాంటివాటిని అరికడుతుంది.

నపుంసకత్వ నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుందని అమెరికా లోని ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్‌ రాబిన్‌సన్‌ పేర్కొంటున్నారు. సెక్స్ సామర్ధ్యం సన్నగిల్లడం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం తదితర సెక్స్ సంబంధ లోపాలకు వెల్లుల్లి దివ్యౌషధమని అంటారు. వెల్లుల్లిలో విటమిన్ సి, బి6, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు స్త్రీల రుతుక్రమాన్ని సరి చేయడమే కాదు ఇతర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వెల్లుల్లని కాస్త నీటిలో మరిగించి ఆ నీటిని ఉదయం పరగడపున తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వెల్లుల్లి రసం, 2 స్పూన్ల తేనె కలుపుకుని తాగితే ఆస్త్మా నుంచి దూరం కావొచ్చు.

వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది. నోటి దుర్వాసనతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే ఆ దుర్వాసన నుండి బయటపడతారు.

వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటి (బ్లడ్‌ క్లాట్స్‌) వాటి ముప్పు నుండి రక్షణ పొందవచ్చు. సో ప్రతి రోజూ మన ఆహారంలో వెల్లుల్లి చేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories