మీ పిల్లలు చల్లటీ నీరు తాగుతున్నారా ..!

మీ పిల్లలు చల్లటీ నీరు తాగుతున్నారా ..!
x
Highlights

వేసవి కాలంలో చాలా మంది చల్లని నీరు తాగేందుకు ఇష్టపడతారు. చల్లటి నీటి కోసం ఫ్రిజ్ బాటిల్ తీసుకుని ఎక్కువగా తాగుతుంటారు. అయితే చల్లని నీరు పిల్లల...

వేసవి కాలంలో చాలా మంది చల్లని నీరు తాగేందుకు ఇష్టపడతారు. చల్లటి నీటి కోసం ఫ్రిజ్ బాటిల్ తీసుకుని ఎక్కువగా తాగుతుంటారు. అయితే చల్లని నీరు పిల్లల మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా, చిన్నారుల ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందకుండా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వేసవి కాలంలో చల్లని నీటికి బదులు ఇతర ప్రత్యామ్యాయ ద్రవాలు వారికి తాగించాలి సలహా ఇస్తున్నారు.

చల్లని నీరుకు బదులుగా ప్లెయిన్‌ ఫిల్టర్‌ వాటర్‌ ఇవ్వాలి. నీటిలో ఎటువంటి క్యాలరీలు, ఎటువంటి హానికారక రసాయనాలు ఉండవు. కొంత మంది పిల్లలు, పాలు తక్కువగా తాగి నీటిని ఎక్కువగా తాగడానికి ప్రయత్నిస్తారు. వారికి లాక్టోజెన్ లోపం తలెత్తుతుంది. పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలు సోయామిల్క్‌ తాగించాలి.

సోయ మిల్క్ తాగడం ద్వారా వాటిలోని ఖనిజాలు, ప్రొటీన్లు అధికం. పిల్లల శారీరక ఎదుగుదల తోర్పడుతాయి. కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజల్ని తినడానికి ఇష్టపడుతారు. ఇలాంటి వారికి ఆల్మండ్‌ మిల్క్‌ తాగించడం బెటర్. ఇందులో ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికం. తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం పిల్లలకు అందుతుంది.

పుచ్చకాయ, మామిడి, బత్తాయి, ఆపిల్‌ జ్యూస్‌లు పిల్లలకు తరుచూ తాగిస్తూ ఉండాలి ఎండాకాలంలో పిల్లల దాహాం తీర్చేందుకు నిమ్మరసం ఇస్తుండాలి. ఏది పడితే అది తినే పిల్లలకు అప్పుడప్పుడు కడుపులో గడబిడ మొదలవుతుంది. అలాంటి పరిస్థితిల్లో వారికి పల్చటి మజ్జిగ తాగించాలి. దీంతో ఉదర ప్రశాంతత మారుతుంది.జీర్ణప్రక్రియ సుఖవంతంగా సాగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories