ఉప్పు అధికంగా తింటున్నారా? అయితే..

ఉప్పు అధికంగా తింటున్నారా? అయితే..
x
Highlights

మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేకుండా తినాలంటే చాలా కష్టం ఉంటుంది. అయితే చాలామంది కేవలం రుచి కోసమే వంటకాలను ఉప్పు వెసుకుని వాటిని...

మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేకుండా తినాలంటే చాలా కష్టం ఉంటుంది. అయితే చాలామంది కేవలం రుచి కోసమే వంటకాలను ఉప్పు వెసుకుని వాటిని ఆస్వాదిస్తారు. వంటకాలు ఏవైనా .. ఉప్పు లేకుండా వాటికి రుచికాదు. ఏ వంటకంలోనైనా సరే.. ఉప్పు తప్పని సరిగా ఉపయోగించాలి. ఉప్పు వాడటం మంచిదే అందుకని మోతాదుకు మించి తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తింటే.. కలిగే సమస్యలు ఓసారి చూద్దాం

కొన్ని సార్లు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన రావడానికి కారణం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం. అలాగే ఉప్పు మోతాదుకు మించడం వల్ల దాహం కూడా ఎక్కువగా వెస్తుంది. కావున ఈ లక్షణం కనిపిస్తున్నా వారు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి. కావున అలాంటి వారు ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే సరిపోతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే మరో నష్టం నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచులను గుర్తించలేవు. దీంతో ఏది తిన్నా సహించదు.ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలనిపిస్తుంది దీంతో బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

. ఉప్పు అధిక మోతాదులో తీసుకునే వారి శరీరంలో వాపులు వస్తాయి. కాలి మడమ భాగంలో ఉబ్బి వేలితో టచ్ చేస్తే చర్మం లోపలికి పోతుంది. దానికి కారణం ఆ భాగంలో నీరు ఎక్కువగా చేరడమే. కనుక ఉప్పు విషయంలో జాగ్రత్త వహించండి. శరీరంలో నీరు త్వరగా అయిపోయడానికి ఉప్పు అధికంగా తీసుకోవడమే కారణం. దీంతో డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది. ఆహారంలో ఉప్పు తగ్గించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories