వానాకాలంలో తినాల్సిన 3 ముచ్చటైన మునగ వంటలు

3 Dietician-Recommended Drumsticks Recipes To Keep Healthy During Monsoon
x

వానాకాలంలో తినాల్సిన 3 ముచ్చటైన మునగ వంటలు

Highlights

వానాకాలం పైగా ఆషాడ మాసం మొదలవబోతుంది. ఇక మునగ ప్రియులకు పండగే పండగ. ఎందుకంటే ఈ సీజన్‌లోనే ఎక్కువగా మునగాకుని తింటుంటారు.

వానాకాలం పైగా ఆషాడ మాసం మొదలవబోతుంది. ఇక మునగ ప్రియులకు పండగే పండగ. ఎందుకంటే ఈ సీజన్‌లోనే ఎక్కువగా మునగాకుని తింటుంటారు. అంతేకాదు ఆషాడం మొదలైతే మునగాకిని తినాలని కూడా కొంతమంది పెద్దలు చెబుతున్నారు. మరి అసలింతకీ మునగాకుతో చేసుకునే వంటలేంటి? ఇప్పుడు చూసేద్దాం.

చాలామందికి మునక్కాయతో చేసే వంటలు తెలుసు. కానీ మునగాకుతో ఎలాంటి వంటలు చేసుకోవాలి. మునగాకు చప్పగా ఉంటుంది. కాబట్టి వంటల్లో అది టేస్టీగా మారాలంటే ఏం చేయాలో తెలియదు. అయితే అలాంటి వారికోసమే ఈ మునగ వంటలు..

లాభాలెన్నో..

మునగాకులో లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయి. అందుకే వానాకాలంలో మునగాకుని తీసుకోవాలంటారు. ముఖ్యంగా మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, రాగి , ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్, నికోటిన్ వంటి ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి, రోగ నిరోధక శక్తి ని పెంచడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు, బీపీ, డయాబెటీస్ నియంత్రణలో కూడా మునగ చాలా భాగా ఉపయోగపడుతుంది.

వంటలు

మునగాకు, కొబ్బరి

కొబ్బరిని తురుమి ఒక గిన్నెలో వేసి అందులో కాస్త నీళ్లు పోసి స్టవ్‌పైన పెట్టాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. ఈ నీటిలో నిలువుగా చీరిన ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు.. ఇవన్నీ కూడా ఆ నీటిలో వేసేయాలి. మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత అందులో కడిగి, చిన్న చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకున్న మునగాకుని అందులో వేయాలి. ఒక ఐదు లేదా 10 నిమిషాలు ఉడికిన తర్వాత పొడి పొడిగా తయారవుతుంది. దీన్ని వెల్లుల్లి, నల్ల మినపప్పు, ఇంగువతో తాలింపు వేయాలి.

మునగాకు కందిపప్పు

కందిపప్పులో నీళ్లు పోసి, సగానికి కొంచెం ఎక్కువగా ఉడికించి పెట్టుకోవాలి. ఈ పప్పులో మునగాకులు వేయాలి. కాసేటపికి పొడిపొడిగా అవుతుంది. అప్పుడు దీనికి తాలింపు పెట్టకుని తింటే సూపర్...

మునగాకు, తెలగపిండి

ఒక గిన్నెలో తెలగపిండి వేసి కాస్త నీళ్లు వేయాలి. ఇది మరుగుతున్నప్పుడు అందులో కొంచెం ఉప్పు, కారం , పసుపు, ఉల్లి పాయ, పచ్చిమిర్చి ఒక పది నిమిషాలు అయిన తర్వాత సన్నగా తరిగిపెట్టుకున్న మునగాకుని కూడా వేసి మరగనివ్వాలి. కాసేపటికి ఇది డ్రైగా మారిపోతుంది. అప్పుడు తాలింపు వేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తినాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories