Basil Seeds Uses: వేసవి తాపాన్ని తగ్గించే సబ్జా గింజలు

‌‌‌‌Health Benefits of Basil Seeds | Sabja Seeds Uses in Telugu
x

Basil Seeds

Highlights

Basil Seeds Uses: సబ్జా గింజలను రోజుకు మూడు, నాలుగుసార్లు తీసుకుంటే వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది.

Basil Seeds Uses: బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది. ఇంట్లో ఉంటే ఒకటే ఉక్క పోత. ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరండం లేదు. ఎండల్లో తిరిగేవారికే కాక నీడపట్టున ఉన్నవారు కూడా దాహానికి గురవుతుంటారు. దాహం అనేది అసలు శరీరంలో నీటి శాతం తగ్గినపుడు జరుగుతుంది. ఆ సమయంలో మంచినీళ్లకు బదులు కూల్‌డ్రింకులు, ఎనర్జీ డ్రింకుల వైపు మనసు మరుళుతుంది. అలాంటి వంటివి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాటి బదులు సబ్జా గింజల్ని తాగితే అన్నీ ప్రయోజనాలే. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు... ఎప్పుడైనా సరే... దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వేసవి తాపాన్ని తగ్గించే సబ్జా గింజల గురించి మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం

 • సబ్జా గింజలకు నీరు తగలగానే 10 రెట్లు లావుగా తయారయ్యి జెల్ లా తయారవుతుంది. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి సబ్జా గింజల పానీయం బాగా ఉపయోగపడుతుంది. సబ్జా గింజలు శరీరాన్ని చల్లబరుస్తాయి.
 • సబ్జా గింజలను రోజుకు మూడు, నాలుగుసార్లు వేసవిలో తీసుకుంటే వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. అందువల్ల చాలామంది సబ్జా గింజలను నిమ్మకాయి నీరు , షర్బత్, మిల్క్‌షేక్‌ల వంటి రిఫ్రెష్ డ్రింక్స్‌లలో వేసుకుని తీసుకుంటారు..
 • సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు.
 • అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
 • సబ్జా గింజలను నూరి కొబ్బరి నూనెలో చేసి, ప్రభావిత ప్రాంతాలపై రాయడం వల్ల తామర, సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది.
 • సబ్జా గింజలను నానబెట్టకుండా, నూరి ఒక కప్పు కొబ్బరి నూనె‌లో వేసి, కొన్ని నిమిషాలు పాటు వేడి చేసి అప్లై చేయండి.
 • బాసిల్ గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరంలో కొల్లాజెన్‌ స్రవిస్తుంది, ఇది చర్మం దెబ్బతిన్నప్పుడు కొత్త చర్మ కణాలను ఏర్పరుస్తుంది. సబ్జా గింజల్లో ఐరన్, విటమిన్ కె, ప్రోటీన్ ఉన్నాయి. ఇవి పొడవాటి, జుట్టుని బలంగా చేయడంలో తోడ్పడుతుంది. ప్రోటీన్, ఐరన్ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు వాల్యూమ్‌ని పెంచుతుంది.
 • చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
 • నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.
 • సబ్జా గింజలలో యాంటిస్పాస్మోడిక్ ఉంటుంది. అంటే ఇవి స్పాస్మాటిక్ కండరాలలో ఉద్రిక్తతను తగ్గించి ఉపశమనం ఇస్తాయి. ఈ విధంగా దగ్గును నియంత్రించడంలో సాయపడుతుంది. ఇవి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వైసెనిన్, ఓరింటిన్, బీటా కెరోటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ శరీరం యొక్క రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి.
 • కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు, దీని వల్ల అవి త్వరగా తగ్గుతాయి.
 • తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. సమ్మర్లో సబ్జా గింజలను మన డ్రింక్స్ లో కలిపి తీసుకుంటే దాహం నుండి బయపడవచ్చు.
Show Full Article
Print Article
Next Story
More Stories