చన్నీటి స్నానం చేయడం మంచిదే!

చన్నీటి స్నానం చేయడం మంచిదే!
x
Highlights

చల్లని నీటితో స్నానం చేయడం మంచిదేనా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే కూల్ వాటర్‌తో స్నానంచేయడం మంచిదే అంటున్నారు నిపుణులు. వాటితో స్నానం చేయడం...

చల్లని నీటితో స్నానం చేయడం మంచిదేనా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే కూల్ వాటర్‌తో స్నానంచేయడం మంచిదే అంటున్నారు నిపుణులు. వాటితో స్నానం చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓసారి చూద్దాం..

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరిగుతుంది. అందువల్ల రోజూ చన్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి నాలుగు కిలోల వరకు బరువు తగ్గుతారు. చల్లని నీళ్ల వల్ల శరీరం వణుకుతుంది. అంటే కండరాల్లో కదలిక వస్దుంది. దీంతో అవి మళ్లీ సాధారణ స్థితికి రావడానికి క్యాలరీలు ఖర్చవుతాయి. ఈ పక్రియతో శరీరం పన్నబడానికి మార్గం సుగుమవుతుంది. విదేశాల్లో బరువు తగ్గడానికి ఐస్‌బాత్‌లకు వెళుతుంటారు. చల్లిటి నీరు లింఫటిక్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.

అవి నేరుగా లింఫ్‌ రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. దాంతో అవి చురుగ్గా మారతాయి. నీరు తగలగానే రక్తనాళాలు సంకోచించి చెంది మళ్లీ వ్యాకోచిస్తుంటాయి. వీటివల్ల బాడీలో పేరుకున్న ఇన్ఫెక్షన్లు టాక్సిన్లూ రసాయనాలూ అన్నీ బయటకు పోతాయి. ఈ లింఫటిక్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే చాలా మంది తరచూ జలుబుబారిన పడుతుంటారు. చన్నీటి స్నానం వల్ల మానిసిక ఆందోళన కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది.

దాంతో ఒత్తిడి, ఆందోళనలు ఉండవు. పైగా చర్మమూ జుట్టూ ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది. అలాగే కూల్ వాటర్ స్వేదరంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీంతో చర్మం టైట్‌గా మారి, నూనె విడుదల చేయకుండా ఉంటుంది. ఫలితంగా చర్మం జిడ్డు కారకుండా ఆరోగ్యంగానూ ఉంటుంది. పొడిచర్మం వాళ్లకి ఇది చాలా మంచిదే. రక్తప్రసరణ వేగంతోబాటు ఊపిరి తీసుకునే వేగం పెరుగుతుంది. మానసిక దృఢత్వం కూడా చన్నీటి స్నానం చేసేవాళ్లలో ఎక్కువగా ఉంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories