Top
logo

Pumpkin Seeds: శృంగార సామర్థ్యం పెంచే గుమ్మడి గింజలు

10 Health Benefits of Pumpkin Seeds
X

ఫైల్ ఇమేజ్


Highlights

Life Style: పరిపూర్ణ ఆరోగ్యం పొందాలంటే రోజు వారీ ఆహారంలో గుమ్మడి గింజలు చేర్చుకుంటే సరి....

Pumpkin Seeds: తెలుగు వారందరికి గుమ్మడి కాయ సుపరిచితమే. గుమ్మడికాయ వేళాడదీయని తెలుగిళ్లు వుండదంటే అతిశయోక్తి కాదేమో. ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి అంటుంటారు. ఇటు వంటలకు అద్భుతమైన రుచి, అటు ఆనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడి కాయను కట్ చేసుకొని, గింజలను పారేస్తుంటారు. అయితే ఆ పారేవేసే గుమ్మడి గింజల్లోని వైద్యపరమైన ఔషధ గుణగణాలు వున్నాయి. అవేంటే హెచ్ ఎం టీవి 'లైఫ్ స్టైల్ ' లో చూద్దాం...

గుమ్మడికాయ గింజలు సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగులో దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి మరియు ఏడాది పొడవునా కాలంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయి. ఈ విత్తనాల్లో జింక్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, సెలీనియం, కాల్షియం మరియు ఫాస్పరస్ యొక్క అద్భుతమైన మూలంగా ఉన్నాయి. మరియు ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బి-విటమిన్, బీటా-కెరోటిన్ మరియు విటమిన్ ఎ సమ్మేళనాలతో నిండి ఉంటుంది.

 • గుమ్మడి విత్తనాలను పురుషులు తరచుగా తీసుకుంటే వారిలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ గింజలు తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచడంతో పాటు శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు రాకుండా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
 • గుమ్మడికాయ విత్తనాలను తరచుగా తీసుకోవడం వలన శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తిని పెంచుటకు గుమ్మడికాయ విత్తనాలు దివ్యౌషధంగా ఉపయోగపడుతాయి. నిత్యం వ్యాయామం చేసిన తరువాత గుమ్మడికాయ విత్తనాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని అధ్యయనంలో తెలియజేశారు.
 • ఇవి ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతాయి. భాస్వరం యొక్క ఉనికి మీ జీవక్రియలను పునరుద్దరించడానికి మరియు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయం చేస్తుంది. గుమ్మడికాయ గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అజీర్ణం నివారించడంలో కూడా సహాయం చేస్తాయి.
 • గుమ్మడికాయ విత్తనాలలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. గ్యాస్ట్రికి, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్ల నుండి విముక్తి కలిగిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
 • గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం నిల్వలను కలిగి ఉంటాయి, ఇది గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తపోటును నిర్వహించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం మరియు జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 • శరీర ముడతలు తగ్గించుకోవటానికి, కండరాలకు మరమ్మత్తులు చేయడంలో, కొత్త కణాలను నిర్మించడంలో గుమ్మడికాయ విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయి. నిత్యం వ్యాయామం చేశాక గుమ్మడికాయ విత్తనాలను తింటే చక్కని దేహ దారుఢ్యం సొంతమవుతుంది. వాటిల్లో ఉండే వాపు, మంట తదితరాలు తగ్గుతాయి. అవి జీర్ణశక్తిని పెంచుతాయి.
 • ఈ గింజల్లో ఫైబర్ వల్ల బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఇతరత్రా తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు... ఈ గింజలు జీర్ణక్రియను కూడా మంచిగా చేస్తాయి.
 • మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.గుమ్మడికాయ విత్తనాలలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి.
 • కరోనా వైరస్ ను నివారించడానికి లేదా ఎదుర్కోవటానికి మెగ్నీషియం బాగా సహాయపడుతుందని చాలా అధ్యనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ వల్ల వచ్చే లక్షణాల్లో ఒకటైన శ్వాసకోశ రుగ్మతలను తగ్గించడంలో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చేసిన అధ్యనంలో తేలింది.
 • కొంతమందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. కళ్లు ముయ్యగానే ఏవేవో ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియక నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు గుమ్మడికాయ గింజలు తింటే సరి. వీటిలో ట్రైప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేలా చేస్తుంది.
 • అదేపనిగా తినడం వల్ల గ్యాస్ మరియు ఉబ్బర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు ఒకేసారి అధిక మోతాదులో తీసుకోవడం మూలంగా మలబద్ధక సమస్యలు కూడా రావొచ్చు. కావున, ఎట్టి పరిస్థితుల్లో పరిమితి మించకుండా తీసుకోరాదు.
Web Title10 Health Benefits of Pumpkin Seeds
Next Story