మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి

మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి
x
Highlights

జీవితంలో విజయం సాధించాలని ఎవరికి ఉండదు.ఆశ ఉంటే సరిపోదు దాన్ని సాధించాడానికి కృషి చేయాలి. అది సాధ్యం కావాలంటే సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం ఒక్కటే...

జీవితంలో విజయం సాధించాలని ఎవరికి ఉండదు.ఆశ ఉంటే సరిపోదు దాన్ని సాధించాడానికి కృషి చేయాలి. అది సాధ్యం కావాలంటే సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం ఒక్కటే కాదు.. అదనంగా పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని...

మనకంటూ జీవితంలో ఓ లక్ష్యం ఉంటుంది. మన ఆలోచన, ఊహ ఎప్పుడూ కూడా దాన్ని సాధించాలనే దృక్పధం ఉండాలి. భవిష్యత్‌లో వచ్చే విజయం ఫలితంగా కలిగే ఆనందంపైనే మన ఆలోచన ఉండాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చలించకుండా లక్ష్యం గురించి ఆలోచిస్తుండాలి. గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. ఏదయినా సమస్య వచ్చినప్పడు వెంటనే కృంగిపోకుండా దాన్నో సవాలుగా మార్చుకుని చూడండి. అప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే కోణంలో ఆలోచిస్తాం.

మనకున్న నైపుణ్యాలూ, ప్రతిభతో ఆ సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తుండాలి. విజయాలు సాధించిన, జీవితంలో ఉన్నత శికరాలకు ఎదిగిన ప్రముఖులు చెప్పిన సూత్రం ఇదే. - బలహీనతలు, భయాలు సామాన్యులకే కాదు, జీవితంలో గెలిచిన వారికీ ఉంటాయి. కానీ వాళ్లు వాటిపై ఫోకస్ చేయకుండా తమ బలాలు అందుబాటులో ఉన్న అవకాశాలపైనే దృష్టి సారిస్తారు. ఈ ధోరణియే వారిని విజయం సాధించేలా చేస్తుంది. కావున మీరు కూడా లోపాల కన్నా. మీలో ఉన్న పాజిటీవ్ అంశాలపైన దృష్టి సారిచండి. మీ బలాలు, భయాలు రాసుకుని వాటిలోని ఒక్కో లోపాన్ని నెమ్మదిగా అధిగమించేలా చూడండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories