షూ కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించండి...

షూ కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించండి...
x
Highlights

ప్యాషన్‌,వ్యాయమ సమయంలో షూ ధరిస్తాం. అయితే షూస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మన పదాలకు తగ్గట్టుగా వాటిని సెలక్ట్ చేసుకోవాలి. తగిన...

ప్యాషన్‌,వ్యాయమ సమయంలో షూ ధరిస్తాం. అయితే షూస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మన పదాలకు తగ్గట్టుగా వాటిని సెలక్ట్ చేసుకోవాలి. తగిన సైజు, ఆక‌ృతి గల షూస్‌ వాడటం మంచిది. దీనివల్ల వేగవంతమైన శారీరక కదలికల ప్రభావం మోకాళ్లు, పాదాలపై పడకుండా రక్షణ లభిస్తుంది. చేసే వ్యాయామాన్నిబట్టి షూ ఎంపిక చేసుకోవాలి. వ్యాయామానికి వాడే షూ ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఎలాంటి షూస్ ఎంపిక చేసుకోవాలో ఓసారి చూద్దాం...

రన్నర్ షూస్‌కు కుషన్‌, బౌన్స్‌ ఎక్కువగా ఉండాలి. టెన్నిస్‌ ఆడేవారు వారు పాదం కోరిన రీతిగా వంచేందుకు వీలుగా ఉండే షూ ఎంపిక చేసుకోవాలి.

- వాకింగ్‌, జాగింగ్‌ చేసేవారు స్ట్రాంగ్ బేస్‌ ఉన్న షూ వాడుతుండాలి

-వారంలో 5 రోజులు రన్నింగ్‌ చేసేవారు 9 నెలలకు ఒకసారి అలాగే రోజూ వాకింగ్‌ చేసేవారు ఏడాదికోసారి షూ మారుస్తుండాలి

-ధర తక్కువని నాసిరకం షూ తీసుకోవడం కంటే కాస్త ధర ఎక్కువైనా మంచివి తీసుకొంటే ఎక్కువకాలం ఉంటాయి.

- కొత్త షూ కొనేటప్పుడు పాదం సైజులో వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకోని వాటిని ధరించాలి

- వేసుకున్న షూ వ్యాయామ సమయంలో పాదానికి పట్టే చెమటను పీల్చుకొనేలా ఉండాలి.

-షూ లేస్‌ విప్పగానే పాదం నుంచి ఈజీగా బయటికి వచ్చేంత వెసులుబాటు ఉన్న షూను సరైనదిగా భావించాలి. అలాగని ఇరుకుగా ఉండే షూ తీసుకోవద్దు. షూ కొనేముందు ఇలాంటి విషయాలను పరిగణాలోకి తీసుకోండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories