మనసు పెట్టి తింటేనే మంచిది

మనసు పెట్టి తింటేనే మంచిది
x
Highlights

హడావుడి .. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్‌కు వెళ్ళలనే టెన్షన్..ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళలనే హడావుడి..ఇలాంటి ఉరుకుల పరుగు జీవితంలో వేళకు తీనక సమస్యలు...

హడావుడి .. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్‌కు వెళ్ళలనే టెన్షన్..ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళలనే హడావుడి..ఇలాంటి ఉరుకుల పరుగు జీవితంలో వేళకు తీనక సమస్యలు తెచ్చుకుంటున్న వారు చాలా మంది. భోజనం మీద మనసు లేక శరీరానికి పోషకాలు సరిగ్గా అందక రోగాల బరిన పడుతున్నారు. టైంకు తీనడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు.. బరువు తగ్గేందుకు డైట్‌ పాటిస్తున్న 53 మందిపై ఆరు నెలలుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో అనేక విషయాలను వెల్లడించారు... 6 నెలలు శద్దతో కూడిన డైటింగ్ సెషన్‌కు హాజరైన వారు సగటున 3 కిలోల బరువు తగ్గారట. హడావుడిగా సెషన్‌కు వచ్చినవారు కిలో మాత్రమే తగ్గారట.

ఖాళీ సమయం దొరికినప్పుడు ఆహారపదార్థాలను కడుపునిండా లాగించేస్తాం. తీరా బరువు పెరిగి, తగ్గించుకునేందుకు కసరత్తులు, నానా కష్టాలు పడతాం. అయితే ఈ సమస్యకు సులువైన పరిష్కారం చెబుతున్నారు పరిశోధకులు. శ్రద్దతో పనిచేయడం వల్ల ఉద్రేకం తగ్గి, ఆలోచనల మీద గురి ఉంటుంది. దీంతో ఒత్తిడి తగ్గి, అదనపు శక్తితో రెట్టించిన ఉత్సాహం వస్తుంది . మనసుపెట్టి తినడం వల్ల ఆహారాన్ని సంతృప్తిగా తినడం అలవాటు పడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పటిష్ఠంగా ఉంటుందని అంటు్న్నారు పరిశోధకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories