మీ పాత ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు

మీ పాత ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
x
Highlights

ఓ ఫోన్‌ను మనం ఏడాది వాడగానే అది మనకు పాతదవుతుంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్లను వాడలనిపిస్తుంది. ఇలా కొత్త ఫోన్ కొనుక్కుని పాత ఫోన్...

ఓ ఫోన్‌ను మనం ఏడాది వాడగానే అది మనకు పాతదవుతుంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్లను వాడలనిపిస్తుంది. ఇలా కొత్త ఫోన్ కొనుక్కుని పాత ఫోన్ మార్చేస్తున్నారు. కొత్త ఫీచర్లతో కూడిన ఫోన్ ఉపగిస్తూ పాతవాటిని పక్కనపెట్టేస్తున్నారు. అలాగే పాత ఫోన్లను తిరిగి అమ్మితే మంచి రేటు రావడం లేదు. దీంతో కొందరు ఇంట్లో వాటిని ఊరికే పడేస్తున్నారు. అయితే అలాంటి స్మార్ట్ఫోన్లను ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు.

మన స్మార్ట్ఫోన్లో ఇన్ఫ్రా-రెడ్ బ్లాస్టర్ అనే ఆప్షన్ ఉంటే ఫోన్ను యూనివర్సల్ రిమోట్గా ఉపయోగించుకోవచ్చు. షావోమీ లాంటి కొన్ని బ్రాండ్ ఫోన్లలో 'ఇన్బిల్ట్ రిమోట్' కూడా ఉంటుంది. వాటిని ఇంట్లోని ఎయిర్ కండీషనర్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్స్వస్తువులను ఆపరేట్ చేసేందుకు వాడుకోవచ్చు.అలాగే 'ఎయిర్ ప్యూరిఫయర్లు, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్' వంటివి ఆపరేట్ చేసుకోవడానికి ఫోన్లో ప్రత్యేక యాప్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

అలాగే మన ఫోన్‌ను ఇంట్లో సెక్యూరిటీ కెమెరాగా వాడుకోవచ్చు ఇంట్లో కావాల్సిన చోటులో కెమెరా క్యాప్చర్ చేసేలా ఫోన్ను ఫిక్స్ చేయండి. దానికి ఫుల్ చార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే నెట్ కనెక్షన్ తప్పనిసరి ఉండాలి. 'ఐపీ వెబ్క్యామ్, ఎట్హోమ్కెమెరా' వంటి యాప్ ఇన్స్టాల్ చేసుకుని, కెమెరా ఆన్ చేసి. ఆ ఫోన్తో మీ ఫోన్కు నెట్ ద్వారా కనెక్ట్ చేసుకుని అక్కడి దృశ్యాల్ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్లో 'యునిఫైడ్ రిమోట్' అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే పర్సనల్ కంప్యూటర్ కు వైర్లెస్ కంట్రోలర్గా కూడా వాడుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories