కొర్రలు తింటే కొవ్వు తగ్గుతుంది!

కొర్రలు తింటే కొవ్వు తగ్గుతుంది!
x
Highlights

ఆహర విషయంలో చాలా మంది ఇప్పుడు పాత పద్దుతులను పాటిస్తున్నారు. కాలక్రమేణ పట్టిపీడుస్తున్న వ్యాధుల నుంచి తట్టుకునేందుకు తృణధాన్యాలను తినడానికి...

ఆహర విషయంలో చాలా మంది ఇప్పుడు పాత పద్దుతులను పాటిస్తున్నారు. కాలక్రమేణ పట్టిపీడుస్తున్న వ్యాధుల నుంచి

తట్టుకునేందుకు తృణధాన్యాలను తినడానికి ప్రాధన్యం ఇస్తున్నారు వాటిలో కొర్రలకు ఒకింత ఎక్కువగా ప్రత్యేకత ఇస్తున్నారు . సెటారియా ఇటాలికా జాతికి చెందిన కొర్రలు ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తాయి. కొర్రలు ఉపయోగాలు ఎంటో ఓ సారి తెలుసుకుందాం...

మధుమేహాన్ని నియంత్రించటంలో కొర్రలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పాత తరాలు ఎక్కువగా డయా బెటిస్‌ బారిన పడలేదంటే అదంతా ఈ కొర్రల మహిమే . అలాగే కొర్రన్నం తినటానికి డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు మామూలు బియ్యంలో గుప్పెడు కొర్రల్ని వేసి అన్నం చేసుకుని తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.

కొర్రల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో సులువుగా ఆహరం జీర్ణమైపోతుంది. జీర్ణక్రియ సరిగా జరిగేలా కొర్రలు సహాచం చేస్తాయి వాటిలో ప్రొటీన్లు 11 శాతం ఉంటాయి. ముఖ్యంగా కొర్రలతో చేసిన ఆహారం తిసుకుంటే కొవ్వు పెరిగే సమస్యే ఉండదు. శరీరంలోని జీవక్రియల్ని సక్రమంగా నడిపించే శక్తి కొర్రలకు ఉంది . మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహరంలో కొర్రలు చేర్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories