గాలిమేడ నిజంగానే ఉందా!

గాలిమేడ నిజంగానే ఉందా!
x
Highlights

గాలిమేడ పెద్దలు ఆ పదాన్ని సామెతగా వాడుతుంటారు. గొంతెమ్మ కోర్కెలకు గాలిమేడలు కట్టడం ఒక లెక్కా పక్కా.. అనే సామెతను పెద్దలు చెబుతూ ఉంటారు. మరీ ఇంతకీ...

గాలిమేడ పెద్దలు ఆ పదాన్ని సామెతగా వాడుతుంటారు. గొంతెమ్మ కోర్కెలకు గాలిమేడలు కట్టడం ఒక లెక్కా పక్కా.. అనే సామెతను పెద్దలు చెబుతూ ఉంటారు. మరీ ఇంతకీ గాలిమేడ నిజంగానే ఉంటే ఎలా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంటుంది కదా.. అలాంటి గాలిమేడ నిజంగానే ఉంది.ఆ మేడ పేరు హవామహల్‌. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఉంది ఆ మేడ.

హవామహల్‌లో ప్రత్యేక ఆకర్షణ ముందు భాగం గోడకు కిటికీలు ఏర్పాటు చేసి ఉంటాయి. ఎండాకాలంలో కూడా ఈ కిటికీల్లోంచి చల్లటి గాలి వస్తుంది. అందుకే దీనికి హవామహల్‌ అని పిలుస్తారు. అంటే తెలుగులో గాలిమేడ అని అర్థం. ప్రతీ కిటికీకి సన్నగా చెక్కిన జాలీలాంటి నిర్మాణం వంపు తిరిగిన గుమ్మటం ఉంటాయి. ఇవి గాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. సున్నంతో చేసిన అందమైన అంచులతో ఇట్టే ఆకట్టుకుంటాయి. కిటికీల్లోంచి చూస్తే నగరమంతా చక్కగా కనిపిస్తుంది. లోపల ఉన్నవారు బయటివారికి కనిపించకపోవడం విశేషం. రాజపుత్ర రాణుల కోసమే ప్రత్యేకంగా దీనిని కట్టించినట్లు చెబుతారు. మహారాజా సవాయ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఈ గాలిమేడలను 1799లో కట్టించారట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories