కళ్ళు బాగుండాలంటే...

కళ్ళు బాగుండాలంటే...
x
Highlights

నేటి బీజి లైప్‌లో చాలా మంది కళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాలుష్య జీవనంలో కంటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది . వాటి విషయంలో...

నేటి బీజి లైప్‌లో చాలా మంది కళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాలుష్య జీవనంలో కంటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది . వాటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అవి పొడిబారి దురద, మంటతో పాటు కళ్ల కింద నల్లటి చారలు వస్తాయి . అనేక రకాల అలర్జీల నుంచి కళ్లను కాపాడుకోవాలంటే సరియైన డైట్ ఫాలో అవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటుండాలి. వాటిలో సహజంగా ఉండే విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్, లూటీన్, జీక్సాథిన్‌లు యాంటీ ఆక్సిడెంట్లుగా మారి కళ్లకు సహజ సిద్ధమైన సన్‌స్క్రీన్‌గా పనిచేస్తాయి. సూర్యకాంతిలో ఉండే యు.వి. కిరణాల నుంచి కళ్ళను కాపాడుతాయి. కంటి రక్తనాళాలు మెర్గుగా పనిచేయలంటే విటమిన్ సి, బయోఫ్లేవనాయిడ్స్ అవసరం. నారింజ వంటి నిమ్మజాతి పండ్లలో 'సి' విటమిన్ బాగా లభిస్తుంది. కాబట్టి నారింజ పండ్లను అధికంగా తినడం వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి. చేపలు తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. శాకాహారులైతే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలను తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి. అలాగే గుడ్లను తినడం వల్ల కళ్లను సంరక్షించుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories