మెంతులు నానబెట్టిన నీరు తాగితే..

మెంతులు నానబెట్టిన నీరు తాగితే..
x
Highlights

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచు ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. మెంతుల్లో ఫైబర్,...

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచు ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువుతో బాధపడేవారు తరచు మెంతులు తీసుకుంటే బరువు తగ్గుతారు. దాంతోపాటు జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. కప్పు మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని మాత్రం తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి.

దాంతోపాటు ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు జీర్థవ్యవస్థ పనితీరుకు ఎంతగానో దోహదపడుతాయి. అలానే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజూ క్రమం తప్పకుండా మెంతికూర తింటుంటే వ్యాధులు అదుపులో ఉంటాయి. అలానే రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యల్ని నియంత్రిస్తాయి. పురుషులు తరచు మెంతికూర తింటే.. వారిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు మీరు తయారుచేసుకునే ఆహార పదార్థాల్లో మెంతులు లేదా మెంతికూర చేర్చుకుంటే మంచిదంటున్నారు వైద్యులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories