బరువు తగ్గటానికి ఆహారం తినడం మానేస్తున్నారా..!

బరువు తగ్గటానికి ఆహారం తినడం మానేస్తున్నారా..!
x
Highlights

చాల మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. బరువు తగ్గాడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మరి కొంత మంది అయితే తక్కువ ఆహారం తింటారు. అసలు తినడం కూడా మానేసే...

చాల మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. బరువు తగ్గాడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మరి కొంత మంది అయితే తక్కువ ఆహారం తింటారు. అసలు తినడం కూడా మానేసే వారు కూడా ఉన్నారు. తినడం మానడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్స్‌ తీసుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు తోడ్పడుతాయి అంటున్నారు.

* మినప పప్పుతో సాయత్రం సమయంలో స్నాక్ గా ఇడ్లీలు చేసుకొని తింటే ఏ ప్రాబ్లమ్ ఉండదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇడ్లీలు తొందరగా జీర్ణమతాయి కనుక వీటిని తీసుకోవటం మంచిది. మినపపప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ ఉంటుంది కనుక ఇవి తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* సెనగలు తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవటం మంచిది అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ప్రోటీన్స్, పీచు పదార్థాలుంటాయి శరీరానికి మేలు కల్గిస్తాయి అంటున్నారు నిపుణులు.

* బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా తినగలిగేవి మొలకెత్తిన విత్తనాలు. వీటిలో పోషకాలు చాల ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు కూడా ఉంటుంది. వీటితో పాటు కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* ఎండు బఠాణి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వీటిలో ప్రొటీన్స్‌, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండాటానికి దోహాదం చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories