నలుగురిలో అందంగా కనిపించాలంటే ఇలా..!

నలుగురిలో అందంగా కనిపించాలంటే ఇలా..!
x
Highlights

నలుగురిలో అందంగా కనపడాలని ప్రతిఒక్క అమ్మాయికి ఉంటుంది. ఇందుకోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అందంగా కనిపించాలంటే అది చర్మం మీద ఆధారపడి ఉంటుంది. సరియైన...

నలుగురిలో అందంగా కనపడాలని ప్రతిఒక్క అమ్మాయికి ఉంటుంది. ఇందుకోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అందంగా కనిపించాలంటే అది చర్మం మీద ఆధారపడి ఉంటుంది. సరియైన ఆరోగ్య నియామాలు పాటించకపోవడం వల్ల చర్మం నిగారింపు లేక కళతప్పి కనిపిస్తుంది. చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే అందుకు తగిన చిట్కాలు పాటించాలి. శరీరం మెరవలంటే బాదం నూనె ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఇ ఉంటాయి. దీన్ని అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ముఖం మెరిసేల కనిపించాలంటే రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం కలపాలి. దాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అర గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చాలు. ఈ విధంగా చేయడం ద్వారా నలుపు రంగు పోయి, తెల్లగా మెరిసిపోతారు. అలాగే బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం బాగా కలిపాలి. ఆ తర్వాత దాన్ని జుట్టుకు బాగా రాసి గుడ్డతో చుట్టేయాలి. అర గంట తర్వాత షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా ఉంటుంది.

బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా కలిపి నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక ఆముదం,బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదవులపై తరచుగా రాస్తు ఉంటే అవి గులాబీ రంగులోకి మారతాయి. అలాగే బాదం నూనే మృతకణాలు తొలగించి ముఖం శుభ్రంగా ఉండేలా చేస్తుంది. ముఖంపై నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. కొందరి ముఖంపై, శరీరంపైన నల్లటి వలయాలు ఏర్పడతాయి. వాటిని తొలిగించడానికి బాదం నూనెలో, కొబ్బరి నూనెను కలిపి నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి. రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories