టీటీడీ బోర్డు సమావేశంపై వివాదం

టీటీడీ బోర్డు సమావేశంపై వివాదం
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం మరోసారి చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి సమావేశం నిర్వహించడమేంటని మండిపడుతున్నారు వైసీపీ...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం మరోసారి చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి సమావేశం నిర్వహించడమేంటని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. వెంటనే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో టీటీడీ పాలక మండలి అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా గత నెలలలో జరగాల్సిన బోర్డు సమావేశం వాయిదా పడింది. సాధారణంగా మూడు నెలలకోసారి పాలక మండలి సమావేశం జరగాలి. అయితే ఎన్నికల కోడ్ కారణంగా నాలుగు నెలలుగా సమావేశం నిర్వహించలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియడంతో బోర్డు మీటింగ్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.

అయితే ఇప్పుడు టీటీడీ పాలక మండలి సమావేశానికి సిద్ధమవ్వడంపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రభుత్వం నియమించిన పాలక మండలితో ఎలా సమావేశం నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. నామినేటెడ్ పదవులలో ఉన్న వారు వారి ప్రభుత్వం రద్దయిన వెంటనే రాజీనామా చేయాలని అంటున్నారు. పదవులు అట్టిపెట్టుకుని ఉండటం కరెక్ట్ కాదని చెబుతున్నారు.

టీటీడీలో ఉన్నతాధికారులు కూడా ఇంకా గత ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ఆలోచనతో పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశానికి సభ్యులు రెడీ అవుతోన్న టీటీడీ వైసీపీ విమర్శలను ఎలా తీసుకుంటుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories