Top
logo

పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా: షర్మిల

పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా: షర్మిల
X
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలకు, రైతులకు , విద్యార్థులకు ఎలాంటి మేలు జరుగలేదని చెప్పారు. వైఎస్‌ఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేశారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు వైఎస్‌ఆర్ మేలు చేశారు. అమరావతిని అమెరికా, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తానని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా.. పిల్లిపిల్లే.. పులిపులే. సింహం సింగిల్‌గానే వస్తుంది.. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి. వైఎస్‌ఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు.

Next Story