సీబీఐపై జగన్‌ సర్కార్ కీలక నిర్ణయం

సీబీఐపై జగన్‌ సర్కార్ కీలక నిర్ణయం
x
Highlights

సీబీఐపై జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏపీలో సీబీఐ అడుగు పెట్టొద్దంటూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను...

సీబీఐపై జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏపీలో సీబీఐ అడుగు పెట్టొద్దంటూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సీబీఐకి సాధారణ సమ్మతినిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఆద్వర్యంలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే ఇందుకోసం ఆయా రాష్ట్రాలు తమ సమ్మతిని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీబీఐని కేంద్రం రాజకీయ వేధింపులకు ఓ ఆయుధంగా వాడుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories