Top
logo

జగన్‌ బీసీ కార్డ్ స్ట్రాటజీ...టీడీపీ, జనసేన పార్టీలకు...

జగన్‌ బీసీ కార్డ్ స్ట్రాటజీ...టీడీపీ, జనసేన పార్టీలకు...
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ పార్టీ వినూత్న వ్యూహాలతో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది....

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ పార్టీ వినూత్న వ్యూహాలతో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ఒకేసారి 175 అసెంబ్లీస్థానాలకూ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు రాష్ట్రజనాభాలో 40 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజికవర్గానికి పెద్దపీట వేసింది. బీసీకార్డుతో అధికార టీడీపీ, జనసేన పార్టీలకు సవాలు విసిరింది.

ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించాలంటే ఎన్నో సమీకరణాలు. భిన్నకులాలు, మతాలతో కూడిన పలు రకాల ఓటర్లను ఆకట్టుకోవాలంటే పార్టీ ఏదైనా ముందుచూపు, స్పష్టమైన వ్యూహం ఉండితీరాలి. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష వైసీపీ అధికారమే లక్ష్యంగా175 అసెంబ్లీ, పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ జనాభాలో 40 నుంచి 45 శాతం వరకూ ఉన్న బీసీలను దృష్టిలో ఉంచుకొని సీట్ల కేటాయింపులో అధికప్రాధాన్యమిచ్చింది. కాపుసామాజికవర్గం ఓట్లు ఒకవేళ పూర్తిగా పడని పక్షంలో ఆలోటును భర్తీ చేసుకోడానికి వీలుగా బీసీకార్డు వ్యూహంతో అడ్డుకోవాలని వైసీపీ నిర్ణయించింది. టీడీపీ, జనసేన పార్టీల దూకుడును అడ్డుకోడానికి బీసీకార్డును ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 సీట్లలో 41 సీట్లను బీసీ అభ్యర్థులకు వైసీపీ కేటాయించింది. మొత్తం సీట్లలో 28 శాతం సీట్లు బీసీలకే ఇవ్వడం విశేషం. రాష్ట్రజనాభాలో కేవలం 6 శాతంగా మాత్రమే ఉన్న రెడ్డి సామాజికవర్గానికి వైసీపీ అత్యధికంగా 48 సీట్లు కేటాయించింది.

రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించే కాపు సామాజికవర్గానికి సైతం వైసీపీ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు ఇచ్చింది. కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు ఏకంగా 29 సీట్లు ఇచ్చింది. ఆర్థికంగా, రాజకీయంగా అత్యంతబలమైన కమ్మ సామాజికవర్గానికి 10 సీట్లు, బలిజ సామాజికవర్గానికి 4 సీట్లు ఇచ్చారు.

ముస్లిం అభ్యర్థులకు గతంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ఏకంగా 5 సీట్లు కేటాయించింది. 2014 ఎన్నికల్లో ముస్లింలకు నాలుగుగా ఉన్న సీట్లను ఐదుకు పెంచింది. బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలకు చెరో మూడు సీట్లు ఇవ్వడం ద్వారా ప్రధాన సామాజికవర్గాల మధ్య సమతౌల్యం పాటించడానికి కసరత్తులు చేసింది. జనరల్ సీట్లలో ఏకంగా ఏడుగురు బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా వైసీపీ సరికొత్త ప్రయోగమే చేసింది. ఏపీ అసెంబ్లీలోని 140 జనరల్ స్థానాల్లో 41 మంది బీసీ అభ్యర్థులకు సీట్లివ్వడం మరో విశేషం.

రెడ్డిసామాజిక వర్గం అత్యంతబలంగా ఉన్న మూడు నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులకే సీట్లు ఇచ్చి సవాలు విసిరింది. కర్నూలు లోక్ సభ స్థానం నుంచి నేతకార్మికుల కుటుంబానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ ను అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది.

అనంతపురం లోక్ సభ స్థానం నుంచి రంగయ్య ను, హిందూపురం లోక్ సభ స్థానం నుంచి మాధవ్ యాదవ్ ను పోటీకి దించాలని వైసీపీ నిర్ణయించింది.

సీట్ల కేటాయింపులో వినూత్నంగా ప్రయత్నించిన వైసీపీ కి బీసీ కార్డు ఏ మేరకు ఆశించిన ఫలితాలను ఇస్తుంది? జనరల్ సీట్లలో అదీ రెడ్డి సామాజివర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలలో బీసీ అభ్యర్ధులు ఏ రేంజ్ లో రాణించగలరో తెలుసుకోవాలంటే మాత్రం మరికొద్దివారాలపాటు వేచిచూడక తప్పదు.లైవ్ టీవి


Share it
Top