పానీపూరి అమ్మిన కుర్రాడు ఐపీఎల్ వరకూ..

పానీపూరి అమ్మిన కుర్రాడు ఐపీఎల్ వరకూ..
x
yashasvi jaiswal cricketer
Highlights

ఐపీఎల్ వేలంలో టీమిండియా అండర్‌ 19 క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ పైనే అందరి దృష్టి ఉంది. ఎవరి కుర్రాడు అనే అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురు...

ఐపీఎల్ వేలంలో టీమిండియా అండర్‌ 19 క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ పైనే అందరి దృష్టి ఉంది. ఎవరి కుర్రాడు అనే అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశస్వి జైస్వాల్‌ జాతీయ జట్టులో చోటు లక్ష్యంగా శ్రమించాడు. అతని శ్రమ ఇప్పుడు అతనిని ఐపీఎల్ స్థానం సంపాదించేలా చేసింది. చిన్న వయస్సులోనే కొండంత కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించిన క్రికెటర్‌ కావాలనే లక్ష్యానికి వదులుకోలేదు. పానీపూరి అమ్మే స్థాయి నుంచి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.

2020ఐపీఎల్ వేలంలో జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది. జైస్వాల్‌ల కనీస ధర 20 లక్షల రూపాయిలు ఉండగా అతని కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌లు చెందిన ప్రాంచెజీలు జైస్వాల్‌పై ఆసక్తి కనబరిచాయి. చివరకు రాజస్తాన్‌ రాయల్స్‌ రూ.2.40కోట్లకు కొనుగోలు చేసింది.

చిన్ననాటి నుంచి పెద్ద క్రికెటర్‌ కావాలనేది జైస్వాల్ కల. సొంతూర్లో భదోహీ తండ్రి చిన్న కిరాణ షాపు నడుపుతూండేవారు. పిల్లల పోషణ కష్టంగా ఉండేది. బంధువు ముంబైలో ఉంటే అక్కడి వెళ్లారు. అక్కడ పని ఇప్పించాడు. జైస్వాల్ ధ్యాసంతా క్రికెట్‌పైనే. దీంతో పనికిరావంటూ పంపిచాడు. ముస్లిం యునైటెడ్‌ క్లబ్‌ క్రికెట్‌ మైదానంలో ఓ టెంట్‌లో జైస్వాల్ ను ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు. ఆ టెంటే అప్పటి నుంచి జైస్వాల్ ప్రపంచం. అక్కడే లోకల్ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడడం, గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ రోటీలు అందించడమే అతని పని. ముంబైలోని రామ్‌లీలా ఉత్సవాలు జరిగినప్పుడు జైస్వాల్ పానీ పూరీలు అమ్మేవాడు. ఎన్ని చేసిన క్రికెట్ ఆడాలనేదే తన లక్ష్యం. ఇలా చెప్పుకూటూ పోతే అతని కష్టాలు అనేకం.

జైస్వాల్ గాథలు ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో అందరికి తెలిశాయి. అయితే కోచ్‌ జ్వాలా సింగ్‌, జైస్వాల్ విషయం తెలుసుకున్నాడు. దీంతో జైస్వాల్ చేరదీసి కోచ్చింగ్ ఇచ్చాడు. దీంతో స్థానిక క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. అన్ని మ్యాచ్లో కలిపి ఐదేళ్లలో దాదాపు 50 సెంచరీలు చేశాడు. టీమిండియా అండర్‌–19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌లో అండర్‌–19 ట్రైయాంగిల్ సిరీస్‌లో 4 అర్ధ సెంచరీలతో చెలరేగిపోయాడు.

జైస్వాల్ అండర్‌–19 ఆసియా కప్‌ టోర్నీ మొదటిసారి గుర్తింపు పొందాడు. టీమిండియా ఈ టోర్నిలో విజయం సాధించింది. విజయ్‌ హజారే టోర్నీలో 203 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఆ టోర్నీలో మూడు సెంచరీలు సాధించాడు. తాజా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని రెండు కోట్ల 40లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో జైస్వాల్ రాణిస్తే టీమిండియాలో చోటు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories